టాటా అర్కిటెక్చర్ లో డిగ్రీ పొందారు. ఆర్కిటెక్చర్ గా స్థిరపడాలని భావించారు. కానీ పరిస్థితులు అనుకూలించక వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. రతన్ టాటా తండ్రి ఆయనను ఇంజనీర్ ను చేయాలని అనుకున్నారు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. కానీ టాటాకు ఆర్కిటెక్చర్ పై ఉన్న మక్కువతో ఇంజనీరింగ్ కోర్సును వదిలేసి 1959లో న్యాయార్క్ లోని కొర్నెల్ యూనివర్సిటీలో అర్కిటెక్చర్ డి్గ్రీలో చేరారు.
కోర్సు పూర్తి చేసిన ఆయన ఓ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు కానీ విధి ఆయన్ను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టించింది. కానీ విధి వక్రించి టాటా సంస్థ బాధ్యతలు తీసుకుని రావడంతో అర్కిటెక్చర్ వృత్తిని వదిలేశారు. అందుకే తాను అర్కిటెక్ట్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడరు. అర్కిటెక్ట్ గా కొనసాగకపోవడంపై చింతిస్తున్నానని రతన్ టాటా పేర్కొన్నారు.
వృత్తికి దూరమైనా కోర్సులో నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడతాయని టాటా చెబుతుంటారు. అర్కిటెక్చర్ కోర్సులో మన సామర్థ్యం ఎలా పెంచుకోవాలనే దానిపై అవగాహన ఉంటుంది. పలు కోణాల్లో వచ్చే చిక్కులను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విషయాలు తెలుస్తాయి. అర్కిటెక్ట్ వ్యాపారవేత్త కాలేడని చెప్పలేం. ఎందులో మనకు అదృష్టం ఉంటే అందులో కలిసి వస్తుందని తెలుసుకోవాలి. ఆ రంగంలోనే ఎదిగేందుకు కృషి చేయాలని చెబుతుంటారు.