వైఎస్సార్ కు నివాళి: షర్మిల వచ్చింది.. జగన్ రావాలి

కడప జిల్లా ఇడుపుల పాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ప్రారంభానికి షర్మిల సన్నాహాలు పూర్తి చేశారు. వైఎస్సార్ టీపీ పేరుతో గురువారం సాయంత్రం ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో అభిమానుల సమక్షంలో పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ విధానాలను వెల్లడిస్తారు. రాజన్న రాజ్యమే ఎజెండాగా […]

Written By: Srinivas, Updated On : July 8, 2021 12:07 pm
Follow us on

కడప జిల్లా ఇడుపుల పాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ప్రారంభానికి షర్మిల సన్నాహాలు పూర్తి చేశారు. వైఎస్సార్ టీపీ పేరుతో గురువారం సాయంత్రం ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో అభిమానుల సమక్షంలో పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ విధానాలను వెల్లడిస్తారు.

రాజన్న రాజ్యమే ఎజెండాగా షర్మిల పార్టీని ఏర్పాటు చేయనున్నారు. వైఎస్సార్ కు ఉన్న అభిమానులతో కలిసి పార్టీని ముందుకు నడిపించడమే లక్ష్యంగా కదులుతున్నారు. తెలంగాణలోని సమస్యల పరిష్కారానికి తనదైన ముద్ర వేస్తూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ర్టంలోని పలు ప్రాంతాలను చుట్టొచ్చిన షర్మిల ఇక పార్టీ విస్తరణకు పెద్దపీట వేసేందుకు చూస్తున్నారు.

నిరుద్యోగుల సమస్యలపై కూడా షర్మిల ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. రాష్ర్టంలో ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న నిరుద్యోగుల సమస్యలపై పోరాటానికి రెడీ అయిపోతున్నారు. నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో పర్యటించి నిరుద్యోగుల కుటుంబాలను ఓదార్చారు. దీంతో షర్మిల ప్రస్తుతం ఇంకా దూకుడు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఇతర పార్టీలు కూడా షర్మిల పార్టీ వైపు చూస్తున్నాయి రాష్ర్టంలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో అనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు షర్మిల పెట్టబోయే పార్టీ ప్రభావం ఎంత ఉంటుందోనని ఆలోచనలో పడిపోయారు. పార్టీ విస్తరిస్తే మాకు ఏ మేరకు పోటీ పడుతుందోనని బెంగతో ఉన్నారు. రాజన్న అభిమానుల అండతో పార్టీని నడిపిస్తామని ఇప్పటికే చెప్పడంతో ఆయన అభిమానులు అటు వైపే వెళతారని తెలుస్తోంది.

ఇక వైఎస్ షర్మిల ఈ ఉదయం వైఎస్ఆర్ కు నివాళులర్పించి వెళ్లింది. ఈ సాయంత్రం 4 గంటలకు ఏపీ సీఎం జగన్ నివాళులర్పించేందుకు వస్తున్నారు. పార్టీ ప్రకటన తర్వాత జగన్, షర్మిల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రావడం.. వీరిద్దరూ కలుసుకోకుండా విడివిడిగా నివాళులర్పించడం చూస్తే విభేదాలు నిజమేనని అనిపిస్తోంది..