జనసేనాని పవన్ కళ్యాణ్ సైలెంట్ గా తన మానాన తను దీక్ష చేసుకుంటూ ఏపీలో ప్రభుత్వ అసమ్మతి నిర్ణయాలపై నిలదీస్తున్నారు. ఇటీవల అంతర్వేది రథం దగ్ధం సందర్భంగా పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఏపీలోని అంతర్వేది ఆలయ రథం దగ్గం ఘటనపై ధర్మ పోరాట దీక్ష చేసిన పవన్ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో పవన్ ను అవమానించేలా ట్రోల్ చేశారు.. పవన్ ఫొటోలను క్షుద్రపూజలు చేస్తున్న విధంగా చిత్రీకరించి అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రచారం చేశారు. దీనిపై జనసేన భగ్గుమంది. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశవారు.
Also Read: పార్లమెంట్ సాక్షిగా ఏపీకి కేంద్రం హామీ
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసత్యప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పార్టీ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో అస్యతం ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైంకు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం ఫిర్యాదు చేసింది.
పవన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని.. పోలీసులు సానుకూలంగా స్పందించారని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం తెలిపారు. పవన్ పై ఎవ్వరూ తప్పుడు ప్రచారం చేసినా జనసేన వదిలిపెట్టదని హెచ్చరించారు.
Also Read: నేలవిడిచి సాము చేస్తున్న జగన్
కాగా సోషల్ మీడియానే ఆయుధంగా వాడే జనసేన పార్టీ ఏకంగా పోలీసుల గడప తొక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడుతూ ట్రోల్స్ చేసే జనసేన ఫ్యాన్స్ దెబ్బ రాష్ట్రమంతా తెలుసు. కానీ వారే బాధితులుగా పోలీసులను ఆశ్రయించడం సంచలనమైంది.