కరోనా విజృంభిస్తున్నవేళ సెంటిమెంట్లేమిటని అందరూ అనుకుంటారు.కానీ సీఎం కేసీఆర్ మాత్రం వాటికే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఎంతటి అత్యవసర పరిస్థితిలోనైనా తన మాట నెగ్గించుకోవాలని చూస్తుంటారు. ఈ విషయంలో మిన్ను విరిగి మీద పడినా స్పందించరు. ఒక్కోసారి సొంత పార్టీ నేతలనే కలుసుకోవడానికి అపాయంట్ మెంట్ ఇవ్వరు. సన్నిహితులకు సైతం సర్ ప్రైజ్ ఇస్తుంటారు. గుడ్డిగా సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. కొందరు విశ్వాసాలకు పాత్రులు అయిపోతుంటారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్నది సాధించే వరకు విశ్రమించేది లేదని భీష్మించుకు కూర్చుంటారు.
వరంగల్ వెళ్లినప్పుడల్లా..
వరంగల్ పర్యటనకు వెళ్లినప్పుడల్లా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లడం సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్. దీంతో శుక్రవారం ఎంజీఎం పర్యటనకు తరలిన సీఎం కెప్టెన్ ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చారు. దీంతో ఆయన సెంటిమెంట్ ను ఎంతగా నమ్ముతారో అర్థమైపోతోంది. ఎన్ని ముఖ్యమైన పనులున్నా కెప్టెన్ ఇంటికి మాత్రం కచ్చితంగా వెళతారు. అంత సెంటిమెంట్ ఆయనకు. ఆయన ఇంటికి వెళ్లిన తరువాతే మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో కేసీఆర్ కు ఉన్న నమ్మకం గురించి వేరే చెప్పనక్కర లేదు. సెంటిమెంట్లకే ప్రాణం ఇచ్చే కేసీఆర్ నూరు ఆరైనా అనుకున్నది సాధించేందుకు ముందుకు వెళతారు తప్ప వెనకకు కాదు అని చెప్పకనే చెబుతారు.
హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్ లో చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నుంచి నే రుగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లి వచ్చారు. తర్వాత మిగిలిన కార్యక్రమాలకు హాజరయ్యారు. వాస్తవానికి కార్యక్రమాల అనంతరం చివర్లో ఎంపీ ఇంటికి వెళ్లాల్సి ఉన్నా మొదట్లోనే వెళ్లి తరువాతే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని తన నైజం ప్రదర్శించుకున్నారు. అనుకున్నది సాధించే వరకు ఎవరినీ లెక్క చేయరు. ఎందాకా అయినా వెళతారు. అప్పుడే ఆయన శాంతిస్తారు. లేకపోతే చిందులు తొక్కుతారు.
ప్రతి పనిలోనూ..
కేసీఆర్ ప్రతి పనిలోనూ సెంటిమెంట్ చూసుకుంటారు. అది లేనిది ఏ పని చేయరు. లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి పనిలో కూడా ఎంతో కొంత సెంటిమెంట్ వెతుక్కుంటారు. ఈ నేపథ్యంలో ఆయన సలహాలు, సూచనలు పాటించినా అందులో కూడా సెంటిమెంట్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ విషయాలు అందరికీ తెలుసు. అందుకే ఎవరు కూడా కల్పించుకోరు. మాట్లాడరు. చేసింది చూస్తారు. చెప్పింది చేస్తారు అంతే.