https://oktelugu.com/

Divorce case : భర్త మరో మహిళతో ఉన్నా తప్పులేదు.. ఢిల్లీ హైకోర్ట్‌ సంచలన తీర్పు!

ఈ కేసులో మొదటి రిలేషన్‌లో భర్త భార్య క్రూరమైన బిహేవియర్‌ తో ఇబ్బందులు పడినట్లు నేరం రుజువవ్వడంతో కోర్టు ఇలాంటి తీర్పునిచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2023 / 10:36 PM IST

    Divorce case

    Follow us on

    Divorce case : భార్య నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ కలుసుకునే అవకాశం లేకుండా ఉన్న భార్యా భర్తల విషయంలో ఢిల్లీ హైకోర్ట్‌ సంచలన తీర్పు ఇచ్చింది. ఇటువంటి సందర్భాలలో భర్త మరో మహిళతో ఉన్నప్పటికీ అది తప్పు కాదని హైకోర్ట్‌ తన తీర్పులో పేర్కొంది. అలాంటి ఒక జంటకు ఫ్యామిలీ కోర్ట్‌ మంజూరు చేసిన విడాకులను హైకోర్ట్‌ సమర్ధించింది. ఫ్యామిలీ కోర్టుకు చెందిన సురేశ్‌కుమార్‌ కైట్‌ నీనా బన్సల్‌ కృష్ణ న్యాయమూర్తులు ఓ జంటకు విడాకులు మంజూరు చేశారు. వీరు 2005 లో విడిపోయారు. అప్పటినుంచి వారు విడిగానే జీవిస్తున్నారు.

    నేరపూరిత ఫిర్యాదు..
    భార్య తన భర్తపై నేరపూరిత ఫిర్యాదులు చేస్తుండడంతో చాలాకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. అతని భార్య ప్రవర్తించిన విధానం భర్త జీవితాన్ని శాంతి మరియు దాంపత్య సంబంధాలను కోల్పోయేలా చేశాయని ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. వీరిద్దరూ గతంలోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉండగానే సదరు వ్యక్తి మరో మహిళతో రిలేషన్‌లో ఉన్నాడు. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

    భర్తను తప్పు పట్టని కోర్టు..
    ఈ విచిత్రమైన కేసులో ఫ్యామిలీ కోర్ట్‌ భర్త చేసిన దాన్ని తప్పు బట్టలేదు. మొదటి రిలేషన్‌ భార్య వలన అతను పొందిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విడాకులు ఇస్తున్నట్లు ఫ్యామిలీ కోర్ట్‌ పేర్కొంది. అయితే.. ఢిల్లీ హైకోర్ట్‌ ఈ తీర్పుని సమర్ధించింది. చాలా కాలంగా కలిసి లేనప్పుడు సదరు భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకుంటే దాని గురించి ఈ భార్య మాట్లాడకపోవడమే మంచిదని తెలిపింది. చాలా కాలంగా భార్యతో ఇబ్బందులు ఎదుర్కొని, తిరిగి కలుసుకోవడానికి అవకాశం లేని విధంగా దూరంగా ఉంటున్న సందర్భాల్లో భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం నేరం కాదని హై కోర్ట్‌ తీర్పునిచ్చింది.

    ఈ కేసులో మొదటి రిలేషన్‌లో భర్త భార్య క్రూరమైన బిహేవియర్‌ తో ఇబ్బందులు పడినట్లు నేరం రుజువవ్వడంతో కోర్టు ఇలాంటి తీర్పునిచ్చింది.