Family: అప్పు పుట్టింది అవ్వ అంటే కొంప మునిగింది కొడుకా అన్నారట. గొప్పలకు పోయి అప్పులు చేసే వారు కొందరైతే.. కుటుంబ నిర్వహణకు అప్పు చేయడం పరిపాటే. కానీ చేసిన అప్పులు కోటలు దాటితే బతుకు కష్టమే. దీంతో అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగిస్తూ కన్నీరును మిగుల్చుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నారు. అప్పుల బతుకు చిందరవందరగా మారుతోంది.

తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన ఓ కుటుంబం విజయవాడకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఫైనాన్స్ సంస్థల వేధింపులతో ఇక బతుకు కష్టమని భావించి సూసైడ్ నోటు రాసి తనువులు చాలించారు. కుటుంబం మొత్తం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధించిన వారి వివరాలు సెల్ఫీలో వీడియోలు తీసి పెట్టారు.
పోలీసులు సెల్ఫీ వీడియో, సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంపై వేధింపులకు పాల్పడిన వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోస్టుమార్టమ్ అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. బంధువులు ఇప్పటికే విజయవాడ చేరుకుని రోదించారు. ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: పోలీస్ స్టేషన్ ముందే వ్యభిచార దుకాణం.. రేట్ ఫిక్స్
నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ (58), ఆయన భార్య శ్రీలత (54), కుమారులు అఖిల్ (26), ఆశిష్ (24) నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్పుల బాధ భరించలేకే నలుగురు ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కరమే. ఈ నేపథ్యంలో బంధువులు మృతదేహాల మీద పడి రోదించారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: Rajasthan Woman: బాయ్ ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ వెళ్లాలనుకున్న రాజస్థాన్ వివాహిత అంత పనిచేసింది?