TED: తిరుమల తిరుపతి దేవస్థానం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై వీఐపీ సేవల సమయాలను మార్చింది. గతంలో వీఐపీలకు ఉదయం పూట సమయం కేటాయించి సామాన్య భక్తులను తరువాత దర్శనాలు కల్పించేవారు. ప్రస్తుతం టీటీడీ తీసుకున్న నిర్ణయంతో భక్తులకు ఊరట కలగనుంది. గత ఇరవై ఏళ్లుగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉదయం పూట దర్శన భాగ్యం దక్కేది కాదు. వీఐపీల దర్శనతం తరువాతే సామాన్యులకు ప్రవేశం కల్పించేవారు. కానీ ప్రస్తుతం టీటీడీ తీసుకున్న నిర్ణయంతో సామాన్య భక్తులకు లాభం చేకూరనుంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత ఈ నిర్ణయం అమలులోకి రానుందని తెలుస్తోంది. దేవుని దర్శనానికి వచ్చే భక్తుల బాధలను అర్థం చేసుకుని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంతో భక్తులకు ఎంతో ప్రయోజనం కలించనుంది. ఈ మేరకు పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
గతంలో వీఐపీ దర్శనాల కోసం ఉదయమే సమయం కేటాయించేవారు. దీంతో వారు దర్శనం చేసుకున్నాకే సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించేవారు. కొత్తగా తీసుకున్న నిర్ణయంతో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య వీఐపీ దర్శనాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం సామాన్య భక్తులకు దర్శనాల అవకాశం కల్పించనున్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణయం అందరికి ఆమోదయోగ్యంగా ఉంది. సామాన్య భక్తులకు ఎంతో ఊరట లభించనుంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల అనంతరం ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చెబుతున్నారు.

కరోనా ప్రభావంతో రెండేళ్లుగా శ్రీవారి దర్శనం కోసం అంతగా భక్తులు రాలేదు. కరోనా మెల్లమెల్లగా కనుమరుగువుతున్న తరుణంలో భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య రెట్టింపవుతోంది. దీంతో కలియుగ దైవం వెంకటేశ్వరుడి దర్శన భాగ్యం కోసం చాలా మంది విచ్చేస్తున్నారు. అందుకే టీటీడీ మార్చిన సమయంతో వీఐపీలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య భక్తులకు ఎంతో సమయం ఆదా కానుంది. వీఐపీల కోసం వేచి చూసే ధోరణి ఇక ఉండదని తెలుస్తోంది.