Vivekananda Reddy Murder Case: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసులో ఇప్పటికి ఎన్నో రకాలుగా దర్యాప్తు చేపడుతున్నా కొలిక్కి రావడం లేదు. దీంతో నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారనే వాదనలు కూడా వెలుగులోకి రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సునీతారెడ్డి వాదనలకు మద్దతుగా కేసు పురోగతిపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. సీబీఐ తీరును తప్పుబట్టింది. ఇన్నాళ్లయినా కేసు పురోగమనంలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనే సునీతా రెడ్డి వాదనతో ఏకీభవించింది.

కేసు పక్క రాష్ట్రంతో విచారణ చేపట్టాలని కోరినా తెలంగాణకు మాత్రం మొగ్గు చూపడం లేదు. తెలంగాణ కాక కర్ణాటక అయినా ఫర్వాలేదనే సూచించారు. దీంతో ఇప్పుడు వివేకా కేసు కొత్త మలుపులు తిరగబోతోంది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని నిందితులైన ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డిలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ జాప్యంపై సుప్రీం సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీతారెడ్డి పిటిషన్ లో చేసిన వాదనలను న్యాయస్థానం సమ్మతించింది. ఆమె అడిగిన ప్రశ్నలు సజావుగానే ఉన్నాయని అభిప్రాయపడింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేసింది. వివేకా కుమార్తె సునీతా రెడ్డి సీబీఐ తరఫున పిటిషన్ దాఖలు చేయడం సబబే అని తెలిపింది. పోలీసు అధికారులు, నిందితుల కుమ్మక్కుతో కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. సీబీఐ విచారణలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రశ్నించింది. ఈ క్రమంలో విచారణ ఎన్నేళ్లయినా విచారణలో ఉండటం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును కూడా తప్పుబట్టింది. విచారణలో ఇంత ఆలస్యమైనా చర్యలు తీసుకోవడం లేదు. నిందితుల పక్షాన నిలబడుతుందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రాష్ర్టంలో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసు ఇంకా ఎన్నేళ్లకు కొలిక్కి వస్తుందో అర్థం కావడం లేదు. సుప్రీం సూచనలతో పక్క రాష్ట్రంతో విచారణ జరిపితే వేగంగా విచారణ పూర్తయి నిందితులకు త్వరగా శిక్ష పడుతుందని ఆశిస్తున్నారు. అందుకే వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి కేసు విచారణలో వేగం పెరిగేలా చేయాలని కోరింది.