https://oktelugu.com/

AP BJP: ఏపీ బీజేపీపై అధిష్టానం సంచలన నిర్ణయం?

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని వైసీపీ నేత విజయసాయిరెడ్డి టార్గెట్ చేసుకున్నారు. పురందేశ్వరి వైసీపీ సర్కార్ వైఫల్యాలు పై మాట్లాడుతుంటే.. విజయ్ సాయి రెడ్డి మాత్రం పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 20, 2023 12:07 pm
    Daggubati Purandeswari
    Follow us on

    AP BJP: ఏపీ బీజేపీ విషయంలో హై కమాండ్ అంతరంగం ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు ఏపీ విషయంలో బిజెపి స్టాండ్ ఏమిటి? వైసీపీకి అనుకూలమా? వ్యతిరేకమా? పోనీ టిడిపితో స్నేహమా? విరోధమా? జనసేన మిత్రపక్షమా? కాదా? ఇలా ఏ విషయంలోనూ బిజెపి నుంచి స్పష్టత లేదు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. ప్రో వైసిపి, ప్రో టిడిపి నాయకులుగా మారిపోతున్నారు. పార్టీని పలుచన చేస్తున్నారు. గాడిలో పెట్టాల్సిన హై కమాండ్ ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.

    ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితురాలైన తర్వాత వైసీపీని టార్గెట్ చేశారు. అంతకు ముందున్న అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం వైసిపి తో పాటు టిడిపిని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేవారు. ఆ సమయంలో ఆయన ప్రో వైసిపి నేతగా ప్రచారం చేశారు. ఇప్పుడు పురందేశ్వరి వైసీపీని టార్గెట్ చేయడంతో.. ఆమెను ప్రో వైసిపి నేతగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పరిణామ క్రమంలో ఏపీలో బిజెపి బలపడక పోగా.. ప్రాంతీయ పార్టీలకు బీ టీమ్ గా మారిపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాల్సిన పార్టీ హై కమాండ్ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో బిజెపి అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు.

    ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని వైసీపీ నేత విజయసాయిరెడ్డి టార్గెట్ చేసుకున్నారు. పురందేశ్వరి వైసీపీ సర్కార్ వైఫల్యాలు పై మాట్లాడుతుంటే.. విజయ్ సాయి రెడ్డి మాత్రం పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండడం విశేషం. కానీ ఏపీ బీజేపీ నాయకులను మాత్రం అధ్యక్షురాలికి సాయం కొరవడుతోంది. పైగా బిజెపిలోని ప్రో వైసిపి టీం విజయ్ సాయి రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తుందన్న టాక్ ఉంది. వారితోనే విజయ్ సాయి రెడ్డి పురందేశ్వరి పై హై కమాండ్ కు ఫిర్యాదులు ఇప్పిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కీచులాటలో అంతిమంగా నష్టపోయేది మాత్రం భారతీయ జనతా పార్టీయే.తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే ఏపీ ఫై హై కమాండ్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

    పురందేశ్వరి అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత ఇంతవరకు కార్యవర్గ సమావేశం జరగలేదు. ఇప్పుడు ఒంగోలులో అత్యవసరంగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హై కమాండ్ తరపున సీనియర్ నేత బిఎల్ సంతోష్ హాజరవుతున్నారు. ఆయనకు హై కమాండ్ వద్ద పరపతి ఉంది. అంతటి నేత హాజరవుతుండడంతో ఏదో ఒక కీలక నిర్ణయం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అది పార్టీలోనా? లేకుంటే పొత్తుల విషయంలోనా? అన్నది తెలియాల్సి ఉంది.

    మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి వ్యూహం మార్చుకునే అవకాశం ఉంది. పురందేశ్వరిని మార్చుతారని వ్యతిరేకవర్గం ప్రచారం చేస్తుంది. అయితే ఆమె నియమితులై నాలుగు నెలలు అవుతున్న దృష్ట్యా సాధ్యపడదని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకుంది. ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీతో జనసేన నడుస్తోంది. ఇప్పుడు ఏపీ విషయంలో బిజెపి ఏదో ఒక నిర్ణయం వెల్లడించక అనివార్య పరిస్థితి. అందుకే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. నేతల అభిప్రాయాలను తీసుకుంటారని.. బయట ప్రచారం జరుగుతోంది. అయితే బిఎల్ సంతోష్ లాంటి నాయకుడు హాజరుకానుండడంతో కార్యవర్గ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బిజెపిలో ప్రచారం జరుగుతోంది. మరి ఎలాంటి నిర్ణయం వెల్లడవుతుందో చూడాలి.