Plastic Ban: పర్యావరణం కాలుష్యం విపరీతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణంలో ప్లాస్టిక్ వాడకం వల్ల తీవ్ర నష్టం కలుగుతుందని, దీనిని నివారించేందుకు తాజాగా కొన్నిఆదేశాలు జారీ చేసింది. ఒకసారి వాడి పడేసిన బాటిళ్ల ఉత్పత్తిపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ నేషేదం జూలై 1 నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే 75 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లకే అనుమతి ఉంటుంని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఒకేసారి వినియోగించి పాడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో భారతదేశమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈనెల ఒకటో తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించింది. వీటితో పాటు ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రైలపై కూడా నిషేధం విధించింది. ఇక ప్లాస్టిక్ బ్యాగులు కూడా పర్యావరణానికి ముప్పును కలిగిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్ల కవర్లనే వాడాలని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తగా ఈ పరిమితి 50 మైక్రాన్ల వరకు ఉందని పేర్కొన్నారు. ఈ నియమాలను అనుసరించి పర్యావరణానికి సహకరించాలని ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
Also Read: Janasena and BJP : జనసేన-బీజేపీ మధ్య కోల్డ్ వార్ నిజమా? అసలేం జరుగుతోంది?
ఇక కేంద్ర ప్రభుత్వం నూతన తుక్కు విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఫిట్నెస్ లేని వాహనాలకు స్వస్తి పలకాలని పేర్కొంది. వాటి ద్వారా అధిక కాలుష్యం వెలువడుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా కొత్త వాహనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో కొత్త వాహానాలు ఉత్పత్తి కావొచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో జరిగిన పెట్టుబడుల సదస్సులో తెలిపారు. దేశాభివృద్ధిలో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ గొప్ప మైలురాయి అని, అలాగే చెత్త నుంచి సంపదను సృష్టించే మార్గమని తెలిపారు.

నూతన తుక్కు విధానంతో దేశంలోని మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అలాగే గుజరాత్ లో ఈ పెట్టుబడులతో విస్త్రృత అవకాశాలు తీసుకొస్తుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితితో నిండిన వాహనాలను స్క్రాప్ చేసి మెరుగైన వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇందులో భాగంగా స్ట్రాటప్ కంపెనీలను ఏర్పాటు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ పాలసీతో దేశ వ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు వీలవుతుందని పేర్కొన్నారు.
Also Read:BJP Aim To Win Telangana: తెలంగాణలో విజయసంకల్పమే బీజేపీ లక్ష్యమా?
[…] […]