https://oktelugu.com/

విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం

కేంద్రం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను అప్రజాస్వామికంగా మూజువాణితో ఓటుతో ఎలాంటి ఓటింగ్ పెట్టకుండా ఆమోదింప చేసుకోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీనికి కారణమైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చి సంచలనం రేపాయి. Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం ఈ మేరకు పార్లమెంట్ లోని ప్రధాన 12 విపక్ష పార్టీలు కలిసి ఈ తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ తెలిపారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2020 / 05:05 PM IST
    Follow us on

    కేంద్రం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను అప్రజాస్వామికంగా మూజువాణితో ఓటుతో ఎలాంటి ఓటింగ్ పెట్టకుండా ఆమోదింప చేసుకోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీనికి కారణమైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చి సంచలనం రేపాయి.

    Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం

    ఈ మేరకు పార్లమెంట్ లోని ప్రధాన 12 విపక్ష పార్టీలు కలిసి ఈ తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ తదితర పార్టీలు ఈ నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా కాంగ్రెస్ తో కలిసి మోడీ సర్కార్ పై ఫైట్ కు రెడీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

    రైతు, వ్యవసాయ విధానాలపై ఇవాళ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా వ్యవహరించినందుకు ఈ నోటీసులు ఇచ్చామని ప్రతిపక్షాలు తెలిపాయి. దేశ చరిత్రలోనే ఇదో చీకటి రోజుగా అహ్మద్ పటేల్ అభివర్ణించారు.ఓటింగ్ కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడం పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు డిప్యూటీ చైర్మన్ తూట్లు పొడిచారని ఆరోపించారు.

    Also Read: ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు?

    ఇక వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్బంగా విపక్షాల సభ్యులు రాజ్యసభలో చేరి రచ్చపై చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసంలో తాజాగా సమావేశం జరిగింది. డిప్యూటీ చైర్మన్ మైక్ లాగడం.. బిల్లు ప్రతులను చించి వేయడం వంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి వెంకయ్య రెడీ అయినట్లు తెలుస్తోంది.