TDP: తెలుగు తమ్ముళ్ల అంతర్మథనం

TDP: అధికారం కోసం తెలుగుదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీని ఎలాగైనా విజయతీరాలకు చేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నాయకత్వ మార్పు అనివార్యమని చెబుతున్నారు. కానీ సీనియర్లతో బాబుకు తంటాలేర్పడవచ్చని చెబుతున్నారు. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు పనిచేసిన తమ్ముళ్లను కాదనడం ఆయన మనసుకు ఒప్పడం లేదు. కాదంటే పార్టీ విజయం అసాధ్యమనే తెలుస్తోంది. దీంతో పార్టీని ముందుకు తీసుకెళ్లే నేతలకే ప్రాధాన్యం ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇక బాబుకు 2024 ఎన్నికలే చివరివని తెలుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : September 9, 2021 11:44 am
Follow us on

TDP: అధికారం కోసం తెలుగుదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీని ఎలాగైనా విజయతీరాలకు చేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నాయకత్వ మార్పు అనివార్యమని చెబుతున్నారు. కానీ సీనియర్లతో బాబుకు తంటాలేర్పడవచ్చని చెబుతున్నారు. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు పనిచేసిన తమ్ముళ్లను కాదనడం ఆయన మనసుకు ఒప్పడం లేదు. కాదంటే పార్టీ విజయం అసాధ్యమనే తెలుస్తోంది. దీంతో పార్టీని ముందుకు తీసుకెళ్లే నేతలకే ప్రాధాన్యం ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ఇక బాబుకు 2024 ఎన్నికలే చివరివని తెలుస్తోంది. అందుకే పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టి హాయిగా సెలవు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఈసారి కూడా విజయం అంత సులువు కాదనే అర్థమవుతోంది. దీంతో పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. యువరక్తమైతే ఎలా ఉంటుందని సమాలోచనలు సాగిస్తున్నారు. కొందరు నేతలు ఇప్పటికే తమకు అవకాశం కల్పిస్తే పార్టీని గెలిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

కొందరు యువనేతలైతే తమకు పార్టీ ఫండ్ కూడా అక్కర్లేదని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న నిధులతోనే ఎన్నికల్లో నిలబడతామని తేల్చేస్తున్నారు. రాయలసీమకు చెందిన ఓ నేత బాబుతో నేరుగా మాట్లాడి అవకాశం ఇస్తే నిరూపించుకుంటామని దీమాగా చెప్పారట. దీంతో చంద్రబాబు మదిలో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. దీంతో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ఆలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది.

పాత తరం నాయకులు కూడా పార్టీలో ఎక్కువగానే ఉన్నారు. వారంతా పార్టీని నమ్ముకుని ఉన్నదంతా అమ్ముకుని పార్టీ ఎప్పటికైనా కాపాడుతుందనే ఆశతోనే ఉన్నారు. కానీ వారిని కాదంటే ఎట్లా అని చంద్రబాబు దూరాలోచనలో పడ్డారు. ఏదిఏమైనా టీడీపీ మాత్రం ఈసారి అధికారం చేజిక్కించుకోవాలంటే పలు మార్పులకు శ్రీకార చుట్టక తప్పడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు పార్టీని ఏ మేరకు విజయ తీరాలకు చేరుస్తారో చూడాలి.

యువ నాయకులు నారా లోకేష్ ను కలిసి తమకు అవకాశం కల్పించాలని విన్నవించనున్నట్లు తెలిసింది. తమ మనసులోని మాట ఆయనకు చెప్పుకుని ఆయన నాయకత్వంలోనే పార్టీని ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో సమూల మార్పులు చేపడితేనే పార్టీ మనుగడ సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికనుగుణంగా నాయకులు కూడా తమ పద్దతులు మార్చుకుని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని నాయకులు కోరుకుంటున్నారు.