Bandaru Satyanarayanamurthy: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వ్యక్తిగత విమర్శలకు సైతం నేతలు వెనుకడుగు వేయడం లేదు. రాజకీయ విభేదాలు కాస్తా.. వ్యక్తిగత వైరంగా మారాయి. దీంతో నేతలు విచక్షణ కోల్పోతున్నారు. ముఖ్యంగా మంత్రి రోజాపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు అరెస్టు తరువాత మంత్రి రోజా స్వీట్లు పంచుకొని మరి ఎంజాయ్ చేశారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిని టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అధినేత జైల్లో ఉండడంతో.. ఆ బాధలో ఉన్న టిడిపి శ్రేణులకు రోజా వ్యవహార శైలి పుండు మీద కారం చల్లినట్టుగా మారింది.
తెలుగుదేశం పార్టీ క్లిష్ట సమయంలో ఉండగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితోపాటు నందమూరి బాలకృష్ణ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు అరెస్టును ఖండించడంతో పాటు తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ ముగ్గురిని సైతం మంత్రి రోజా టార్గెట్ చేశారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంత్రి రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రోజాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తామని బాహటంగానే చెబుతున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం రోజాపై ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే.. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా గత జీవితం ఇది అంటూ గుట్టును బయటపెట్టారు. గతంలో రోజా బ్లూ ఫిల్మ్ ల్లో సైతం నటించిందని చెప్పుకొచ్చారు. 1999 ఎన్నికల్లో మిర్యాలగూడలో ఎన్నికల ప్రచార సమయంలో రోజా ఎవరితో గడిపారు తనకు తెలుసునని సంచలన కామెంట్స్ చేశారు. ఆ సమయంలో రోజా తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదని.. తాను టిడిపి ప్లానింగ్ కమిటీ సభ్యుడిగా ఉండేవాడినని సత్యనారాయణమూర్తి గుర్తు చేశారు. రోజా ది చీకటి బతుకు అని ఆరోపించారు. ఆమె బ్లూ ఫిలిమ్స్ వీడియోలు తమ వద్ద ఉన్నాయని.. మహిళలను కించపరచడం తమ ఉద్దేశం కాదని.. అందుకే విడిచిపెట్టినట్లు బండారు సత్యనారాయణమూర్తి వెల్లడించారు. చంద్రబాబు గురించి కానీ, నందమూరి కుటుంబ సభ్యులకు గురించి గానీ మరోసారి మాట్లాడితే రోజా చీకటి బాగోతాన్ని బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టిడిపి శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.