Muslim Family: ముస్లిం కుటుంబం సెల్ఫీ వీడియో.. ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ

  Muslim Family: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో భూకజ్జాల పర్వం కొనసాగుతోంది. ప్రజలకు అండగా ఉండాల్సిన పార్టీలే వారిని వేధింపులకు గురిచేస్తున్నాయి. దీంతో వారు ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ తతంగం వైరల్ అవుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు సైతం విమర్శలు చేస్తున్నాయి. కంచే చేను మేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలవాల్సిన నేతలే అరాచకాలు సృష్టిస్తుంటే ఎలా అనే ఆశ్చర్యం వేస్తోంది. దీనిపై టీడీపీ కూడా తనదైన శైలిలో […]

Written By: Srinivas, Updated On : September 11, 2021 7:22 pm
Follow us on

 

Muslim Family: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో భూకజ్జాల పర్వం కొనసాగుతోంది. ప్రజలకు అండగా ఉండాల్సిన పార్టీలే వారిని వేధింపులకు గురిచేస్తున్నాయి. దీంతో వారు ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ తతంగం వైరల్ అవుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు సైతం విమర్శలు చేస్తున్నాయి. కంచే చేను మేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలవాల్సిన నేతలే అరాచకాలు సృష్టిస్తుంటే ఎలా అనే ఆశ్చర్యం వేస్తోంది. దీనిపై టీడీపీ కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది.

దువ్వూరు మండలం ఎర్రబెల్లికి చెందిన అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని ఓ వీడియోను పోస్టు చేశారు. సీఎం జగన్ కు ఈ విషయం చేరాలని కోరుతూ విన్నవించారు. వైసీపీ నాయకులే తమ భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే మైదుకూరు రూరల్ సీఐని కలిస్తే న్యాయం చేస్తారని చెప్పారని అన్నారు. కానీ ఆయన అధికార పార్టీకి అమ్ముడుపోయి తమపై కాఠిన్యం ప్రదర్శిస్తున్నారని వాపోయారు. తిరుపాల్ రెడ్డికి సహకరిస్తూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు.

చెప్పినట్లు వినకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. తమపై దుర్భాషలాడుతూ తమ ప్రభావం చూపిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలతో తమ పొలం దక్కకుండా పోతోందని భయం వేస్తోందని అన్నారు. తమను స్టేషన్ లో ఉంచి వారితో వ్యవసాయం చేయిస్తున్నారని లబోదిబోమన్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలే ఇలా చేస్తే ఇక ప్రజలకు దిక్కెవరని ప్రశ్నించారు.

అక్బర్ బాషా సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేయడంతో కడప ఎస్పీ అన్చురాజన్ అక్బర్ బాషా కుటుంబాన్ని పిలిపించి బాధిత కుటుంబంతోపాటు వైసీపీ నేతలతో విచారణ చేశారు. అక్బర్ బాషా సెల్ఫీ వీడియోపై స్పందించారు. ఈనెల 9న అక్బర్ బాషా స్పందన కార్యక్రమంల పిటిషన్ ఇచ్చారన్నారు. సీఐ వ్యవహారంపై విచారణ చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం రెండు రోజుల పాటు సీఐని విధుల నుంచి తప్పించామని వెల్లడించారు.