https://oktelugu.com/

సెకండ్ వేవ్: దేశంలో కల్లోలానికి కారణమదే!

దేశాన్ని కరోనా రెండోసారి అతలాకుతలం చేసింది. సెకండ్ వేవ్ తో వేల మంది ప్రాణాలు తీసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. ఈ పాండమిక్ లో ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. అన్ని కుటుంబాలు తీరని శోకంతో ఉన్నాయి. ఇప్పటికీ కరోనా కల్లోలాలు కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. ఆస్తులన్నీ అమ్ముకుంటున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. భారత్ లో గత సంవత్సరం వచ్చిన మొదటి వేవ్ లో బి.1.167 అనే రకం పెద్దగా […]

Written By: , Updated On : June 4, 2021 / 05:13 PM IST
Follow us on

దేశాన్ని కరోనా రెండోసారి అతలాకుతలం చేసింది. సెకండ్ వేవ్ తో వేల మంది ప్రాణాలు తీసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. ఈ పాండమిక్ లో ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. అన్ని కుటుంబాలు తీరని శోకంతో ఉన్నాయి. ఇప్పటికీ కరోనా కల్లోలాలు కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. ఆస్తులన్నీ అమ్ముకుంటున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు.

భారత్ లో గత సంవత్సరం వచ్చిన మొదటి వేవ్ లో బి.1.167 అనే రకం పెద్దగా ప్రాణాలు తీయలేదు. కానీ అందరికీ సోకి అల్లకల్లోలం చేసింది. ఇప్పటితో పోలిస్తే నాడు మరణాల సంఖ్య చాలా తక్కువ. అయితే సంవత్సరం తిరిగేసరికల్లా ఇదే విభాగంలోని మూడు వేరియంట్లు రూపాంతరం చెందాయి. ఇందులో భారత్ లో కల్లాలోనికి కారణమైంది ‘బి.1.617.2’ రకం వేరియంట్. ఇదే దేశంలో సెకండ్ వేవ్ గా విజృంభించింది. ఈ మేరకు ప్రభుత్వం తేల్చేసింది. భారత జినోమిక్ కన్సార్టియా, జాతీయ వ్యాధి నియంత్రణా కేంద్రం (ఎన్.సీ.డీసీ) నిర్వహించిన జన్యుక్రమ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

భారత్ లో సెకండ్ వేవ్ కారణమైన బి.1.167.2 వేరియంట్ బ్రిటన్ లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్ కంటే వేగంగా వ్యాపించే గుణం ఉందని.. దీన్ని డెల్టాగా నామకరణం చేశారు. దేశంలో అత్యధిక కేసులు, మరణాల తీవ్రతకు ఇదే కారణమని తేలింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఉందని.. రెండో దశలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ఢిల్లీ, ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలో ఇదే మరణాలకు కారణమైందనితేల్చారు. వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కూడా ఈ కరోనా విజృంభణలో డెల్టా వేరియంట్ పాత్ర కీలకంగా ఉందని అధ్యయనం తేల్చింది.

దేశంలో కరోనా మరణాల పెరుగుదలకుకు, వ్యాధి తీవ్రత ముదరడానికి డెల్టా వేరియంట్ కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పటికే ఈ వేరియంట్ భారత్ లో ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఇటీవల స్పష్టం చేసింది.