Sand Mafiya: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇసుక మాఫియా (Sand Mafia) రాజ్యమేలుతోంది. ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ఇసుకను దోచేస్తున్నారు. పర్యారవణాన్ని పట్టించుకోకుండా ఇసుక నిల్వలు తోడేయడంతో వాతావరణ సమస్యలు వస్తాయని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలు విమర్శలు వస్తున్నాయి. ఇసుక తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించినా లెక్కచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక మొత్తం జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు అప్పగించింది. ఇటీవల కృష్ణా జిల్లాలో నదిలో 150 లారీలు వరదలో చిక్కుకుపోవడమంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు ఇసుక ఎటు వస్తుందో ఎటు పోతుందో తెలియడం లేదు. అనేక చోట్ల ఇసుక అక్రమంగా చోరీ అవుతుందనేది తెలుస్తోంది. వినియోగదారులు మాత్రం బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సమాచారం. ఇసుక అమ్మకాలు, కొనుగోలులో మోసాలు చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పీఎంవో కార్యాలయం సుధాకర్ ఇన్ ఫ్రా అనే కంపెనీకి ఇసుక రవాణా టెండర్ ఇచ్చినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఇన్ ఫ్రా కంపెనీపై జూన్ 4న విజయవాడలో కేసు నమోదైంది.
ఇసుక దోపిడీలో ప్రభుత్వం తన చేతివాటం ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. ఇసుక దోపిడీలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇసుక రవాణాపై ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. కానీ ఇప్పుడు రవాణా చార్జీలు కూడా రెట్టింపయ్యాయి. ఇసుక ధరలు రెట్టింపు కావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ లోనే కొనుగోలు చేయడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఇసుక విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ ప్రబుత్వం వ్యవహరిస్తున్న తీరు పై ఇప్పటికే పలు విధాలుగా ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో భవన నిర్మాణ రంగంలోని ప్రజలు తమ అవసారలు తీర్చుకునే క్రమంలో సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. ప్రభుత్వమే పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. టీడీపీ అయితే ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతోంది. ప్రజా సమస్యలను గాలికొదిలి ఇసుక వ్యాపారులతో కుమ్మక్కై నిధులు దోచుకుంటోందని ఆరోపణలు చేస్తోంది.