https://oktelugu.com/

Sakshi vs Eenadu : ‘సాక్షి’పై ‘ఈనాడు’ పిటీషన్.. సుప్రీంకోర్టులో జగన్ కు గట్టి షాక్

Sakshi vs Eenadu : ఏపీలో పత్రికల పోరు గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది.. గ్రామ వలంటీర్లకు రూ.200 చొప్పున ప్రభుత్వ నిధులు ఇస్తున్న జగన్ వాటితో సాక్షిపత్రికను కొనుగోలు చేసేలా పరోక్ష జీవో ఇచ్చారు. ఇది తన సొంత పత్రిక సర్క్యూలేషన్ పెంచేందుకే అని ప్రత్యర్థి పత్రిక ఈనాడు సంస్థ సుప్రీంకోర్టుకు ఎక్కింది. అయితే ఇది రెండు పత్రికల లొల్లి కాదని.. ఇందులో రెండు పార్టీలు ఇన్ వాల్వ్ అయ్యాయని తెలుసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం కేసును […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2023 / 10:23 PM IST
    Follow us on

    Sakshi vs Eenadu : ఏపీలో పత్రికల పోరు గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది.. గ్రామ వలంటీర్లకు రూ.200 చొప్పున ప్రభుత్వ నిధులు ఇస్తున్న జగన్ వాటితో సాక్షిపత్రికను కొనుగోలు చేసేలా పరోక్ష జీవో ఇచ్చారు. ఇది తన సొంత పత్రిక సర్క్యూలేషన్ పెంచేందుకే అని ప్రత్యర్థి పత్రిక ఈనాడు సంస్థ సుప్రీంకోర్టుకు ఎక్కింది. అయితే ఇది రెండు పత్రికల లొల్లి కాదని.. ఇందులో రెండు పార్టీలు ఇన్ వాల్వ్ అయ్యాయని తెలుసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం కేసును ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసి నిస్పక్షిక విచారణ జరపాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు నుంచి పిటీషన్ ను బదిలీ చేసి జగన్ కు గట్టి షాకిచ్చింది..

    ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో బాబాయ్ భాస్కర్ రెడ్డి అరెస్టు కాగా, అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. గ్రామ వాలంటీర్ల చేత సాక్షి దినపత్రిక కొనుగోలు చేయిస్తున్న వ్యవహారంలో సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది.

    సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రిక సాక్షి సర్క్యులేషన్ పెంచుకునే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్లు చేత సాక్షి దినపత్రికను కొనుగోలు చేయించేందుకు వారికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేశారు. ఒక్కో వాలంటీర్ పేపర్ కొనుగోలు చేసినందుకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం వారికి అందిస్తోంది. అయితే, వాలంటీర్లు తమకు నచ్చిన పేపర్ కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా.. సాక్షి మాత్రమే తీసుకునేలా చేయడం పట్ల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశంగా పలువురు విశ్లేషిస్తున్నారు.

    సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈనాడు ఉషోదయ సంస్థ..

    వాలంటీర్లకు సాక్షి దినపత్రిక వేసేందుకు ప్రభుత్వం రూ.200 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధులను సొంత పత్రిక కొనుగోలుకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఈనాడు మాతృసంస్థ ఉషోదయ సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటీషన్ పై విచారణ సందర్భంగా సీజేఐ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ, పరిపాలన ప్రయోజనాల దృష్ట్యా విచారణను ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు చంద్రచూడ్ తెలిపారు. ఢిల్లీ హైకోర్టుకు విచారణను బదిలీ చేయడం వల్ల ఏపీ హైకోర్టు పై నమ్మకం పోతుందని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఈ సందర్భంగా తమ వాదనలు వినిపించారు. అలాంటి అభిప్రాయానికి తావు లేకుండా ఉత్తర్వులు ఇస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

    కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం..

    ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది రెండు  దినపత్రికల మధ్య వ్యవహారంగా కనిపించడం లేదని, రెండు పార్టీల మధ్య వ్యవహారంగా కనిపిస్తోంది ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాధనం వాలంటీర్లకు బదిలీ చేసి సాక్షి పత్రికను కొనుగోలు చేయించడాన్ని గతంలో ఈనాడు ఉషోదయ సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిల్ కు ట్యాగ్ చేయాలని, ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం పిటిషన్ పై ఉషోదయ సంస్థ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం.. చివరికి విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.

    సర్క్యులేషన్ పెంచుకునే ఎత్తుగడ..

    సాక్షి దినపత్రిక సర్కులేషన్ పెంచుకావడానికే వైసీపీ సర్కార్ ఈ ఎత్తుగడ వేసింది. విస్తృత సర్క్యులేషన్ ఉండి ప్రభుత్వ పథకాలు సమాచారం ఇచ్చే సాక్షి న్యూస్ పేపర్ కొనాలని వాలంటీర్లకు పరోక్షంగా జీవో జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు. పేపర్ కొనేందుకు ఒక్కో వాలంటీర్ కు నెలకు రూ.200 మంజూరు చేసింది ప్రభుత్వం. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వాలంటీర్ల ప్లే సిప్ లో రూ.5 వేలకు అదనంగా మరో రూ.200 అలాట్ చేసింది ప్రభుత్వం. ఏజెంట్ ఇచ్చిన పేపర్ బిల్లును యాప్ లో అప్లోడ్ చేయాలని వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏజెంట్లు వాలంటీర్ల ఇళ్లకు దినపత్రికను చేరవేస్తున్నారు. తమను అడగకుండా దినపత్రిక ఎలా వేస్తారని కొందరు వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    ఒకే దెబ్బకు రెండు పిట్టలు మాదిరిగా వ్యూహం..

    వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు సాక్షి దినపత్రిక వేయడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. వాలంటీర్లు అందరూ సాక్షి దినపత్రిక చదవడం ద్వారా సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడంతో పాటు.. రాష్ట్రంలో ప్రస్తుతం సర్కులేషన్ లో ప్రథమ స్థానంలో ఉన్న ఈనాడును రెండో స్థానానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది.   ప్రథమ స్థానంలో ఉన్న ఈనాడు పత్రికకు ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ప్రకటనలు ఇవ్వాల్సి వస్తుంది. అదే రెండో స్థానానికి ఈనాడు పడిపోతే ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఆర్థికంగా ఈనాడును దెబ్బ కొట్టినట్లు అవుతుందని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ కేసు ఢిల్లీ కోర్టుకు వెళ్లడంతో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.