Allu Arjun vs Sajjanaar: అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన స్టిక్ట్ ఆఫీసర్ సజ్జనార్

Allu Arjun vs Sajjanaar: ఎక్కడైనా వేలుపెట్టుకో.. కానీ ఆర్టీసీలో వేలు పెడితే మాత్రం ఊరుకోనని ఆ సంస్థ ఎండీ, డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొంది అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా మారిన స్టిక్ట్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్.. వరంగల్ లో యాసిడ్ పోసిన ఇద్దరు యువకులను, దేశంలో సంచలనం సృష్టి దిశ రేపిస్టులను. ఇతర చాలా మందిని ఎన్ కౌంటర్ లో లేపేసి పోలీసుల్లోనే డైనమిక్ ఆఫీసర్ […]

Written By: NARESH, Updated On : November 9, 2021 8:03 pm
Follow us on

Allu Arjun vs Sajjanaar: ఎక్కడైనా వేలుపెట్టుకో.. కానీ ఆర్టీసీలో వేలు పెడితే మాత్రం ఊరుకోనని ఆ సంస్థ ఎండీ, డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొంది అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా మారిన స్టిక్ట్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్.. వరంగల్ లో యాసిడ్ పోసిన ఇద్దరు యువకులను, దేశంలో సంచలనం సృష్టి దిశ రేపిస్టులను. ఇతర చాలా మందిని ఎన్ కౌంటర్ లో లేపేసి పోలీసుల్లోనే డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాడు.

sajjanar rtc md sajjanar

అయితే ప్రమోషన్ లో భాగంగా.. దిశ ఎన్ కౌంటర్ పై న్యాయ కమిషన్ కేసు విచారణ కూడా ఉండడంతో ఆయన పోలీస్ విధుల నుంచి తప్పించి ఆర్టీసీ ఎండీ పోస్టును కట్టబెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ కూడా తన మార్క్ ను సజ్జనార్ చూపిస్తున్నాడు.

ఇప్పటికే ఆర్టీసీల్లో ప్రయాణిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తూ లాభదాయక సంస్థగా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీని దెబ్బతీసే, నీరు గార్చే చర్యల విషయంలో సజ్జనార్ సీరియస్ గా స్పందిస్తున్నారు.

ఇటీవల బైక్, ట్యాక్సీ రైడింగ్ సంస్థ ‘ర్యాపిడో’ యాడ్ లో ప్రముఖ టాలీవుడ్ అగ్రహీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు. ఈ ప్రకటనలో ‘ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయి. ర్యాపిడో చాలా వేగంగా.. సురక్షితంగా ఉంటాయని.. అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని’ ప్రకటనలో అల్లు అర్జున్ అన్నాడు.

ఈ ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భగ్గుమన్నారు. ఈ యాడ్ పై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను తక్కువ చూపడాన్ని సజ్జనార్ ఖండించారు. టీఎస్ ఆర్టీసీని కించపరడాన్ని ఉద్యోగులు, ప్రయాణికులు, సంస్థ సహించదని.. సమాజం కోసం ప్రజారవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలని సజ్జనార్ హితవు పలికారు. అందుకే ఇందులో నటించిన అల్లు అర్జున్ కు.. ప్రకటనను ప్రసారం చేసిన ‘ర్యాపిడో’ సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు.

-వివాదానికి కారణమైన ‘ర్యాపిడ్ ఓ’ ప్రకటన