https://oktelugu.com/

Sajjanar Tweet About RRR: ఎత్త‌ర‌జెండా పాట‌ను కూడా వ‌ద‌ల‌ని స‌జ్జ‌నార్‌.. ఇలా వాడేశాడే

Sajjanar Tweet About RRR: తెలంగాణ ఆఫీసర్ లలో వీసీ సజ్జనార్ రూటే సపరేటు. ఆయన ఏ సంస్థలో ఉంటే ఆ సంస్థకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంటారు. పాత పద్ధతులను పక్కన పెట్టేసి వినూత్న ఆలోచనలతో తాను పని చేసే డిపార్ట్ మెంట్ కు గుర్తింపు తెస్తారు. గతంలో సైబర్ నేరాలపై ఎలాంటి అవగాహన కల్పించి ప్రజలకు ఎంత దగ్గరయ్యారో అందరం చూశాం. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 16, 2022 / 01:43 PM IST
    Follow us on

    Sajjanar Tweet About RRR: తెలంగాణ ఆఫీసర్ లలో వీసీ సజ్జనార్ రూటే సపరేటు. ఆయన ఏ సంస్థలో ఉంటే ఆ సంస్థకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంటారు. పాత పద్ధతులను పక్కన పెట్టేసి వినూత్న ఆలోచనలతో తాను పని చేసే డిపార్ట్ మెంట్ కు గుర్తింపు తెస్తారు. గతంలో సైబర్ నేరాలపై ఎలాంటి అవగాహన కల్పించి ప్రజలకు ఎంత దగ్గరయ్యారో అందరం చూశాం.

    Sajjanar Tweet About RRR

    ఇప్పుడు టీఎస్ఆర్టీసీ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నారు. స్వయంగా ఆయనే బస్సుల్లో తిరుగుతూ తనిఖీలు చేయడం, ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు వేసి ఉత్సాహంగా పని చేసేలా చూస్తున్నారు. ఫంక్షన్లు, వివాహాలకు ఆర్టీసీ బస్సులను అడ్వాన్స్ లేకుండానే అద్దెకు ఇస్తూ మరింత లాభం వచ్చేలా చేస్తున్నారు.

    Also Read: Sudheer- Rashmi: అది ఇవ్వాలా అని సుధీర్‌ను అడిగిన ర‌ష్మీ.. స‌ర‌సాలు ఎక్కువ‌య్యాయంటూ..

    ఇక ఆర్టీసీ బస్సులో డిజిటల్ పేమెంట్ ను తీసుకొచ్చిన ఘనత కూడా సజ్జనార్ కే దక్కుతుంది. అయితే కొత్తగా టాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా సరే దానికి సంబంధించిన పాటలను, ఫొటోలను వాడుకోవడంలో సజ్జనార్ తర్వాతే ఎవరైనా. గతంలో మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, ప్రభాస్ సినిమాలను వాడేసుకున్నారు.

    Sajjanar Tweet About RRR

    ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా వదిలిపెట్టలేదు. ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఎత్తర జెండా పాటలో.. జెండా మీద వందేమాతరం అని రాసి ఉంటుంది. కాగా సజ్జనర్ దాని ప్లేస్ లో టీఎస్ఆర్టీసీ అని ఎడిట్ చేయించి.. ఆ పాటను ఆర్టీసీ సంస్థ కోసం కొత్తగా రూపొందించారు. దీంతో సజ్జనార్ తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి ఆఫీసర్ ఎక్కడ ఉన్న ఆ సంస్థకు మరింత పేరు గుర్తింపు వస్తుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

    Also Read: Most Lonely Heroines: తోడు లేక ఒంటరితనంతో బాధపడుతున్న హీరోయిన్లు వీళ్లే

    Tags