Saidharam Tej Accident video : సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ సీసీటీవీ వీడియో.. వైరల్

Sai Dharam Tej Accident CCTV Footage Released by Madhapur Police: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ యాక్సిడెంట్కు గురికావడంతో మెగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సాయిధరమ్ తేజ్ ను మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ నుంచి జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. పవన్ కళ్యాణ్ హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆయనతోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, వరుణ్ […]

Written By: NARESH, Updated On : September 11, 2021 8:42 am
Follow us on

Sai Dharam Tej Accident CCTV Footage Released by Madhapur Police: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ యాక్సిడెంట్కు గురికావడంతో మెగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సాయిధరమ్ తేజ్ ను మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ నుంచి జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. పవన్ కళ్యాణ్ హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆయనతోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్, చిరంజీవి భార్య సురేఖ తదితరులు అపోలో హాస్పిటల్ కు చేరుకున్నారు.

సాయిధరమ్ తేజ్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. గణపతి పండుగ కావడంతో వినాయకులను చూడడానికి సాయంత్రం స్పోర్ట్స్ బైక్ పై బయటకు వచ్చాడు. మాదాపూర్ తీగల బ్రిడ్జిపై నుంచి వెళుతుండగా బైక్ స్కిడ్ అయ్యింది. బ్రిడ్జిపై ఉన్న రహదారిపై మట్టి పేరుకుపోవడం.. వర్షంతో అది తడిగా మారడంతో స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పింది. స్కిడ్ కావడంతో కుడివైపుకు సాయిధరమ్ తేజ్ బలంగా పడిపోయాడు.

తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. బైక్ తో ఆయన కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ప్రథమ చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను పోలీసులు నటుడు సాయిధరమ్ తేజ్ గా గుర్తించి మాదాపూర్ లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన మెడ పక్కన భుజానికి ఉండే ఎముక విరిగినట్టు చెప్పారు.

తీగల వంతెనపై ఉన్న సీసీటీవీలో సాయిధరమ్ తేజ్ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బ్రిడ్జిపై స్పీడుగా సాయిధరమ్ రావడం.. అక్కడ మట్టిపై స్కిడ్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వీడియో