INS Vikrant: పాక్‌పై ప్రతీకారం భారత్ ఆపరేషన్ సిందూర్‌తో దాడి చేసింది. కేవలం ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసి భారత్ దాడులకు పాల్పడింది. భారత్ చేసిన ఈ వైమానిక దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఇక్కడితో పాక్ ఆగకుండా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో దేశ సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై పాక్ మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో దాడి చేసింది. వీటిని ఇండియన్ సైన్యం సునాయాసంగా నాశనం చేసింది. భారతదేశ త్రివిధ దళాలు ఒక్కసారిగా రంగంలోకి దిగి అన్ని విధాలుగా పాక్‌ను అడ్డుకుంటున్నాయి. పాక్‌పై భారత్ క్షిపణులతో దాడి చేస్తోంది. పాక్‌కి వాణిజ్య సంపద అయిన కరాచీ పోర్టుపై INS విక్రాంత్‌తో భారత్ దాడి చేసింది. పాక్ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే ఈ పోర్టును భారత్ నాశనం చేసింది. పాక్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. అయితే పాక్‌కి వాణిజ్య పరంగా ఎంతో ముఖ్యమైన కరాచీ పోర్టును ధ్వంసం చేసిన INS విక్రాంత్ స్పెషాలిటీ ఏంటి? ఎన్ని యుద్ధ విమానాలను మోయగలదు? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: ఆపరేషన్ సిందూర్.. ఇప్పటికీ ఆయన ప్రసంగమే స్ఫూర్తిదాయకం..
తొలి స్వదేశీ నౌక అయిన INS విక్రాంత్ పాక్‌కు చుక్కలు చూపించింది. అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ పాక్‌ను అన్ని విధాలుగా తిప్పికొట్టింది. అయితే ఈ INS విక్రాంత్‌లో విమాన వాహక నౌక, డిస్ట్రాయర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌకలు అన్ని కూడా ఉన్నాయి. ఇది దాదాపుగా 45 వేల టన్నుల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పొడవు 262 మీటర్లు ఉండటంతో పాటు 59 మీటర్ల వెడల్పు ఇది ఉంటుంది. INS విక్రాంత్ మొత్తం 40 యుద్ధ విమానాలను ఒకేసారి తీసుకెళ్లే పవర్ కూడా ఉంది. అయితే దీన్ని జనరల్ ఎలక్ట్రిక్‌గానే కాకుడా శక్తివంతమైన టర్బైన్లతో కూడా అమర్చారు. ఈ INS విక్రాంత్ 1.10 లక్షల హార్స్‌పవర్ శక్తిని కూడా ఇస్తుంది. ఇందులో రెండు స్క్వాడ్రన్ల మిగ్-29కె యుద్ధ విమానాలతో పాటు 10 క్మావ్ కా-31 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఇవి యుద్ధంలో ఎలాంటి క్షిపణులను అయినా కూడా తిప్పికొడతాయి. అయితే ఈ విమాన వాహక నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి కూడా 1500 కి.మీ వరకు ఉంటుంది. ఈ INS విక్రాంత్‌లో మొత్తం 64 బరాక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఓడ నుంచి గాల్లోకి దూసుకెళ్తాయి. INS విక్రాంత్ అత్యాధునికమైన ఫీచర్లు ఉండటంతో దీనికి పాక్ భయపడుతోంది. ఇందులో బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఉన్నాయి. INS విక్రాంత్‌తో పాక్ ఆయుధాలు, క్షిపణులు అసలు పనికి రావు. అందుకే పాక్ ఎక్కువగా దీనికి భయపడుతోంది. పాక్ కంటే భారత్ దగ్గర అన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న క్షిపణులు ఉన్నాయి. భారత సైన్యం పాక్‌ను వీటితో ఈజీగా తిప్పికొడుతోంది.