రైతులకు కేసీఆర్ శుభవార్తలు!

రైతుబంధు పథకం, రైతు రుణ మాఫీలపై సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్తలు తెలిపారు. రైతుబంధు పథకం అన్ని వేళలా యథాతథంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అర్హులైన అందరికీ వందశాతం రైతుబంధు అందిస్తామన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ 100కు వంద శాతం రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు. వర్షాకాలం పంటకు కూడా రూ. 7 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 8:43 am
Follow us on

రైతుబంధు పథకం, రైతు రుణ మాఫీలపై సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్తలు తెలిపారు. రైతుబంధు పథకం అన్ని వేళలా యథాతథంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అర్హులైన అందరికీ వందశాతం రైతుబంధు అందిస్తామన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ 100కు వంద శాతం రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు. వర్షాకాలం పంటకు కూడా రూ. 7 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

అదే విధంగా రుణ మాఫీ పై కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ. 25 వేల వరకు రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తాన్నారు. అందుకు కావాల్సిన రూ. 1200 కోట్లను బుధవారమే విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మద్దతు ధరకు ధాన్యం కొంటున్నామన్నారు. చిల్లర రాజకీయాలు చేసేవారిని రైతులు నమ్మొద్దని సూచించారు. మొక్కలు, శనగ, కందులు ప్రభుత్వమే కొంటోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఉండేది రైతు రాజ్యం. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్‌‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.’’ అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.