తెలంగాణ సీఎం కేసీఆర్ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ తో పాటు ఒక చేదు వార్తను కూడా విడుదల చేసారు. రాష్ట్రంలో గడిచిన 45 రోజుల్లో మద్యం షాపులు మూసివేశారు. రేపటి నుంచి మద్యం షాపులు ఓపెనింగ్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానితో పాటు మద్యం ధరలను కూడా పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ వెల్లడించారు. రేపటి (మే 7) నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుస్తామని చెప్పారు. అంతేకాకుండా మద్యం ధరలను 16 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. చీప్ లిక్కర్ పై 11శాతం పెంపు ఉంటుందని అన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని, బార్లు, పబ్బులు మాత్రం మూసి ఉంచుతామని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం, మాస్క్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.