RVS Mani Padma Shri: రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో కళాకారులు, వివిధ రంగాల్లో కృషి చేసిన డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారు. అందరిలో ప్రత్యేకం మాజీ ఐఏఎస్ అధికారి రామస్వామి వెంకట సుబ్రహ్మణ్యం(ఆర్వీఎస్ మణి). హోంశాఖలో అండర్ సెక్రటరీగా కీలక పాత్ర పోషించిన ఆయన, అంతర్గత భద్రతా సవాళ్లతో పోరాడారు. హిందుత్వ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాద కుట్రలను ఛేదించారు.
హిందూ టెర్రరిజం కుట్ర..
2004 నుంచు కొన్ని రాజకీయ కార్యకలాపాలు ‘హిందూ టెర్రరిజం’ లేబుల్‌తో దేశ భద్రతా వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించాయి. మక్కా మసీదు, సంజౌతా ఎక్స్‌ప్రెస్, మాలేగావ్ పేలుళ్లను జాతీయవాద సంస్థలతో ముడిపెట్టి ప్రచారం చేశారు. గుజరాత్‌లో 2004 జూన్ 15న జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్–ఎ–తోయిబా ఉగ్రవాదులు అప్పగి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు చనిపోయారు. అందులో ఇస్రత్ జహాన్ అనే 19 ఏళ్ల యువతి ఉంది. అయితే దీన్ని ఫేక్ ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించి, రాజకీయ నాయకులను టార్గెట్ చేయాలని కుట్రలు రచించారు. ఆర్వీఎస్ మణి ఈ కుట్రలను బహిర్గతం చేశారు. డేవిడ్ హెడ్లీ, ఐబీ చీఫ్ ఆసిఫ్ ఇబ్రహీం అఫిడవిట్‌లు ఆయన ప్రయత్నాలకు సాక్ష్యాలు.
సుదీర్ఘ పోరాటం..
హిందుత్వ ఉగ్రవాద కుట్రలను ఛేదించేందుకు, వ్యవస్థలోని లోపాలను బయటపెట్టేందుకు ఆర్వీఎస్‌మణి సురద్ఘీ పోరాటం చేశారు. పుస్తకం ద్వారా ’కాషాయ ఉగ్రవాదం’ వెనుక రహస్యాలను వెల్లడించారు, దేశ భద్రతా చిత్రాన్ని కాపాడారు. న్యాయ వ్యవస్థలోని అవినీతి, రాజకీయ ఆటలను ఎదిరించారు. ఆయన ధైర్యం రాజకీయాల్లో మతపరమైన డివైడ్‌ను అడ్డుకుంది. జాతీయవాదులకు రక్షణ అందించింది. తాజాగా పద్మశ్రీ పురస్కారం ఆయన 20 ఏళ్ల పోరాటానికి గుర్తింపు, భవిష్యత్ అధికారులకు మార్గదర్శకం.
ఆర్వీఎస్ మణి లాంటి అధికారులు దేశాన్ని రక్షించడానికి ముందుండాలి. పద్మశ్రీతో ఆయన కథ అందరికీ తెలియాలి, యువతకు ప్రేరణగా మారాలి.