Agnipath Scheme: ఉక్రెయిన్ ప్రేరణగానే అగ్ని పథ్ పుట్టిందా?

Agnipath Scheme: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు “మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు”. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల తో పోలిస్తే.. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకు పరిణామాలను ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభవిస్తున్నది. కానీ ఈ యుద్ధంలోనే ఉక్రేయిన్ కనబరుస్తున్న యుద్ధ రీతి ప్రపంచాన్ని మొత్తం ఆలోచింపజేస్తుంది. ఉక్రెయిన్.. ఓటమిని ఒప్పుకొని ఓ దేశం “నిలబడు. కలబడు. తలపడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని” రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి […]

Written By: Bhaskar, Updated On : June 18, 2022 3:02 pm
Follow us on

Agnipath Scheme: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు “మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు”. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల తో పోలిస్తే.. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకు పరిణామాలను ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభవిస్తున్నది. కానీ ఈ యుద్ధంలోనే ఉక్రేయిన్ కనబరుస్తున్న యుద్ధ రీతి ప్రపంచాన్ని మొత్తం ఆలోచింపజేస్తుంది.

Agnipath Scheme

ఉక్రెయిన్.. ఓటమిని ఒప్పుకొని ఓ దేశం

“నిలబడు. కలబడు. తలపడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని” రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న యుద్ధంలో కూడా ఉక్రెయిన్ అదే తీరు ప్రదర్శిస్తోంది. రష్యాతో పోలిస్తే సగం కూడా లేని ఉక్రెయిన్ వారికున్న సైనికులతోనే పుతిన్ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకుంటుంది. లక్షల మంది సైన్యం, త్రివిధ దళాలు, బాలిస్టిక్ క్షిపణులు, జలాంతర్గాములు ఉన్నప్పటికీ కూడా రష్యా ఆ దేశాన్ని ఏమీ చేయలేకపోతోంది. సరిగ్గా ఈ పరిణామాన్ని మోదీ, రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్ తో చర్చించారు. మన చుట్టూ ఉన్న శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే అటువంటి సైనిక పాటవాలు మనకు కావాలని అనుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అజిత్ దోవల్ అక్కడి పరిస్థితులను అవపోసన పట్టారు. వెంటనే ప్రధానమంత్రి మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, త్రివిధ దళాల అధిపతులు సమావేశమై అంతకంతకూ పెరిగిపోతున్న రక్షణ వ్యయాన్ని తగ్గిస్తూ మెరుగైన సైనిక దళాలు ఉన్న దేశంగా తయారు చేయాలని నిర్ణయించారు. ఆ చర్చల్లో పురుడు పోసుకున్నది అగ్నిపథ్.

Also Read: Agnipath KCR Political Weapon: యాంటీ బీజేపీ: అగ్నిపథ్ కాల్పుల్లో మరణించిన రాకేష్ ను హీరోను చేస్తున్న టీఆర్ఎస్

రక్షణ వ్యయం ఏటా ఎందుకు పెరిగిపోతున్నది

భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాల వల్ల శత్రు భయం ఎక్కువ. ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నుంచి ఆక్రమణలు పెరిగిపోతుండడంతో భారతదేశం తనను తనను కాపాడుకోవడం కోసం రక్షణ విభాగానికి ఎక్కువ వెచ్చిస్తోంది. రక్షణ విభాగంలో చేస్తున్న ఖర్చులో సింహభాగం జీతాలు పింఛన్ల కి సరిపోతుంది. మనం చేస్తున్న ఖర్చులో పావువంతు కూడా వెచ్చించని ఉక్రెయిన్ మెరుగైన సైనిక దళం తో దశకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆ తరహా శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి సైనికులను సైన్యంలోకి తీసుకోవాలని భావించింది. ఇందుకు కఠిన పరీక్షలతో పాటు కఠిన శిక్షణ ఇవ్వాలని అని నిర్ణయించి అగ్నిపధ్ కు శ్రీకారం చుట్టింది.

Agnipath Scheme

అమెరికా సైనిక బలగాల తరహాలో శిక్షణ

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత నిష్ణాతులైన సైనికులు అమెరికా వద్ద ఉన్నారు. అమెరికా కంటే చైనా ఆర్థికంగా ముందున్నా సైనిక ప్రభావంతో పోలిస్తే చాలా తక్కువ. అమెరికా వాడే శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు, మిస్సైళ్లు, బాలిస్టిక్ క్షిపణులు, జలాంతర్గాములు వంటి ఆయుధాలు చైనా వద్ద లేవు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిన్న మొన్నటి ఇరాక్ వర్కు అమెరికా దండెత్తిన ఏ దేశం కూడా దాని సైనిక శక్తి ముందు తలవంచక తప్పలేదు. ఆ తరహా విధానం లోనే మన దేశ సైనికులకు కూడా అన్ని విభాగాల్లో అత్యంత కఠినమైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ భావించారు. మన దేశంలో ప్రస్తుతం త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికుల సంఖ్య పదిహేను లక్షలు. ఇంకా రిజర్వ్లో ఉంచిన వారి సంఖ్య 10 లక్షలు. యుద్ధాలు ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. అయితే ఏటా వీరికి అందిస్తున్న జీతాలు, పింఛన్ల చెల్లింపులకు రక్షణశాఖ బడ్జెట్ లో సగం వెచ్చించాల్సి వస్తోంది. దాన్ని తగ్గించి చి ఇతరత్రా ఆయుధాలు సమకూర్చుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి మనం చెల్లిస్తున్న వేతనాలతో పోలిస్తే అమెరికా వేతనాలు తక్కువే. అయినప్పటికీ అక్కడి సైనిక పటాలం ఎంతో బలంగా ఉంటుంది. అమెరికాలో మెరికల్లాంటి సైనికులు ఉండటం వల్లే ఆ దేశం ప్రపంచాన్ని శాసిస్తోంది. భారత దేశం ప్రపంచానికి పెద్దన్నగా ఉండాల్సిన అవసరం లేకపోయినా చుట్టూ ఉన్న శతాబ్దాల నుంచి కాపాడుకోవడం కోసం ఆ తరహాలో సైనిక పాటవాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.

ఇతర శాఖల కేటాయింపుల్లో కోత

వాస్తవానికి రక్షణ శాఖ బడ్జెట్ ఏటికేడు పెరుగుతుండడంతో ఇతర శాఖల్లో కోతలు పెట్టాల్సి వస్తోంది. నేటి దేశంలో విద్యా రంగం, మౌలిక వసతుల రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాటికి కేటాయింపులు పెంచాలని ప్రభుత్వానికి ఉన్న రక్షణ శాఖ గుదిబండగా ఉండటంతో అంతంతమాత్రంగా నిధులు ఇస్తున్నారు. వీటివల్ల ప్రయోజనాలు జరగకపోవడంతో విలువైన మానవ వనరులు దేశ సేవకు ఉపయోగపడకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీని వల్ల దేశం ఎంతో సంపదను కోల్పోతోంది. అలాంటివాటిని అధిగమించాలని ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అగ్ని పథ్ అనే స్కీం కి తెలిపినట్లు తెలుస్తోంది.

Also Read:Center Govt- Agneepath Scheme: అగ్నిపథ్ పై కేంద్రం పీచేముడ్

Recommended Video:

Tags