Homeఅంతర్జాతీయంRussia Visa: ఇక ఆ దేశానికి కూడా వీసా అక్కర్లేదు.. భారతీయులకే స్పెషల్‌ ఆఫర్‌!

Russia Visa: ఇక ఆ దేశానికి కూడా వీసా అక్కర్లేదు.. భారతీయులకే స్పెషల్‌ ఆఫర్‌!

Russia Visa: వీసా.. ఏ దేశ పౌరులైనా తమ దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నప్పుడు వీసా తప్పనిసరి. మన దేశం నుంచి ఏటా వేల మంది విదేశాలకు వెళ్తున్నారు. వ్యాపారాల నిమిత్తం కొందరు వెళితే.. ఉపాధి, ఉద్యోగాల కోసం కొందరు. ఉన్నత చదువుల కోసం మరికొందరు.. ఇక సందర్శన కోసం చాలా మంది వెళ్లొస్తున్నారు. అయితే వీరందరికీ వీసా తప్పనిసరగిగా ఉండాలి. అయితే తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల కొన్ని దేశాలు వీసా లేకపోయినా అనుమతి ఇస్తున్నాయి. ఈ జాబితాలో శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాదు మాత్రం కొన్ని దేశాల పౌరులకే అనుమతి ఇస్తున్నాయి. ఇలా భారతీయులకు ఇప్పటి వరకు ప్రపంచంలో 12 దేశాల్లో వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది. తాజాగా ఈ జాబితాలో రష్యా కూడా చేరబోతోంది. ఆయా దేశాల మధ్య ఉన్న సంబంధాలు, పర్యాటక ఆదాయం పెంపు కోసం ఇలా వీసా లేకపోయినా అనుమతి ఇస్తున్నాయి. తాజాగా బారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా కూడా వీసా రహిత పర్యటనలకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈమేరకు ఒప్పందాలు కీలక దశల్లో ఉన్నట్లు తెలిసింది.

2025 నుంచి..
వచ్చే ఏడాది నుంచి భారతీయులకు వీసా లేకపోయిరా పర్యటించే అవకాశం కల్పించాలని రష్యా భావిస్తోంది. స్ప్రింగ్‌ జీసన్‌ నుంచి వీసా ఫ్రీ సదుపాయం అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు రష్యా ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఈ ఒప్పందానికి సంబంధించి పురోగతి కనిపిస్తోంది. దీంతో రష్యాలో పర్యటించే భారతీయ పర్యాటకులు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు మాస్కో సిటీ టూరిజం కమిటీ చైర్మన్‌ ఎన్జీనీ కోజ్లోవ్‌ తెలిపారు.

భారత్‌ కీలక మార్కెట్‌..
భారత్‌ రష్యాకు పర్యాటకంగా కీలక మార్కెట్‌. ఈ ఏడాది గడిచిన ఆరునెలల్లోనే 28,500 మంది భారతీయులు మాస్కోలో పర్యటించారు. గతేడాది ఇదే సమయంలో రష్యాలో పర్యటించిన భారతీయులతో పోలిస్తే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. వాణిజ్యం, వ్యాపార సంబంధిత కారణాలతో రష్యాలో పర్యటించడం ఎక్కువగ. ముఖ్యంగా సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా భారత్‌ను కీలక మార్కెట్‌గా మాస్కో భావిస్తోంది.

నాలుగు రోజుల్లోనే వీసా..
గతేడాది నుంచి రష్యా భారతీయులకు వీసా జారీ మరింత సరళతరం చేసింది. భారతీయులు దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లనే వీసా జారీ చేస్తోంది. సంఖ్యాపరంగా గతేడాది అత్యధిక వీసాలు పొందిన తొలి ఐదు దేశాల్ల భారత్‌ కూడా ఉంది. మొత్తంగా గతేడాది 9,600 భారతీయ పర్యాలకులకు వీసాలు జారీ అయ్యాయి. రష్యాకు వచ్చే విదేశీ పార్యటకుల్లో ఇది ఆరుశాతం.

ఏడాది పొడవునా సమావేశాలు..
ఇక భారత్, రష్యా దేశాల మధ్య ఏడాది పొడవునా సమావేశాలు, పండుగలు, ప్రదర్శనలు, సదస్సులు జరుగుతూనేఉంటాయి. వాణిజ్య టూరిజంకు మాస్కో కేంద్రంగా మారుతోంది. వీటికితోడు భారతీయ వివాహాది శుభకార్యాలకు రష్యాలోని పలుప్రాంతాలను ఎంపిక చేసుకునేందుకు వీలుగా ఆకర్షించాలని యోచిస్తున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. అతిథుల కోసం హోలట్‌ గదుల సంఖ్య 25 వేలకు పెంచే ప్రయత్నాలు చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version