Rupee Falling: రూపాయి పాపాయిలాగా ఏడుస్తోంది. డాలర్ తో పోలిస్తే మారక విలువను అంతకంతకు కోల్పోతుంది. ఇప్పటికే జీవితకాల కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ ఇంకా ఎంతకు దిగజారుతుందో చెప్పలేమంటున్నారు ఆర్థిక వేత్తలు. విదేశీ పెట్టుబడిదారులు ఇండియన్ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగించడం, ముడిచమురు ధరలు పెరగటం, దేశీయ ద్రవ్యోల్వణం వంటివి రూపాయి పతనాన్ని శాసిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లు మార్పుల కారణంగా దేశంలో ధరల సూచి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అప్పుడు 64 ఇప్పుడు 77.62
డాలర్ విలువ అంతకంతకు పెరుగుతుండడంతో ఒక డాలర్ విలువ చేసే వస్తువులకు 2017 లో 64 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు 77.62 చెల్లించాల్సి వస్తుంది. ఇక 2017 నుంచి రూపాయి విలువ ఏటా మూడు పాయింట్ 3.75% చొప్పున పడిపోతుంది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ తో పాటు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్నది. చమురు ధరలు పెరగటం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తో ఇప్పటికే సతమతమవుతున్న దేశ ప్రజలకు మరింత క్షీణించడం శరాఘాతంగా పరిణమించింది. ఇక రూపాయి విలువ ఎంత పతనమైతే మనం తీసుకునే వస్తువులపై మరింత ప్రభావం ఉంటుంది. మనం చెల్లించాల్సిన డబ్బులు పెరుగుతూ ఉంటాయి. సెల్ఫోన్లు, లాప్టాప్ లు, ఎల్ఈడి టీవీలు, డిజిటల్ కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వాడే సర్క్యూట్ బోర్డులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున వాటన్నింటిపైన రూపాయి క్షీణత ప్రభావం ఉంటుంది. ఇక దిగుమతి చేసుకునే విలాసవంతమైన కార్లు, బైక్లతోపాటు కార్ల విడిభాగాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే దేశంగా పెట్రోల్, డీజిల్ ధరలకు మరింత రెక్కలు వస్తాయి. దీనివల్ల రవాణా ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగాగా పెరుగుతాయి రవాణా ఖర్చులు పెరిగినందున కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. తయారీలో ముడిచమురు ను వినియోగించే సబ్బులు, కాస్మోటిక్స్, పెయింట్స్ వంటి ఉత్పత్తులపై పెరిగిన ధరలను కంపెనీలు వినియోగదారులకు మళ్ళిస్తాయి. ఫలితంగా ఆయా ఉత్పత్తుల ధరలు ఖరీదువతాయి. ఇలా ధరలన్నీ పెరిగి ద్రవ్యోల్బణం అడ్డు అదుపు లేకుండా పెచ్చరిల్లుతుంది.
Also Read: Liger Trailer: లయన్ కు, టైగర్ కు పుట్టిన క్రాస్ బీడ్ ‘లైగర్’.. ‘దేవరకొండ’ యాక్షన్ విశ్వరూపం
విదేశీ ప్రయాణం పెనుబారం
రూపాయి పతనంతో విదేశీ ప్రయాణం, విద్య ఖరీదౌతుంది ఎందుకంటే ప్రతి డాలర్ మార్పిడికి ఒక వ్యక్తి ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు లేదా ఎవరైనా విదేశీ పర్యటనకు వెళ్లేవారు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది మరోవైపు ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసే ముందు త్వరగా దాని నివారణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రేపో రేటు ను మార్చింది. సెంట్రల్ బ్యాంక్ తన రాబోయే పాలసీ సమీక్ష సమావేశంలో కీలక రేట్లు మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. దీని ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాల రేట్లు పెంచుతాయి. అంటే ప్రజలు తమ రుణాలపై ఎక్కువ మొత్తంలో ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ధరలతో రూపాయి హెచ్చుతగ్గులకు చాలా ఎక్కువ సంబంధం ఉంటుంది. రూపాయి పతనమైనప్పుడు అది విదేశీ పెట్టుబడిదారుల పోర్టుఫోలియోపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల వారి కొనుగోలు అమ్మకాలు దేశీయ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి వారు ఈక్విటీ మార్కెట్ల నుంచి వైదొలగడం అది పెద్ద పతనానికి దారి తీస్తుంది దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీల స్టాకులు, మ్యూచువల్ ఫండ్ వంటి ఇతర ఈక్విటీ సంబంధిత పెట్టుబడుల విలువ గణనీయంగా తగ్గుతుంది. మరీ ముఖ్యంగా భారతదేశ కరెన్సీ విలువ హెచ్చుతగ్గులకు గురైనప్పుడు పెద్ద పెద్ద కంపెనీల హోల్డింగ్ గణనీయంగా ప్రభావితం అవుతాయి.
అన్ని దేశాలతో పోలిస్తే మన కరెన్సీనే మెరుగు
అమెరికన్ డాలర్ తో రూపాయి కంటే బ్రిటిష్ ఫౌండ్, జపాన్ యేన్, యూరో ప్రాంక్ మారక విలువ అధికంగా క్షీణించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంకు రేట్లు మార్పు కారణంగా భారత సహా వర్ధమాన దేశాల ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. ఫలితంగా డాలర్ తో రూపాయి ఇతర కరెన్సీల మారకం విలువ క్షీణిస్తూ వస్తోంది. పడిపోతున్న రూపాయికి అండగా నిలిచేందుకు విదేశీ మారక నిల్వల్లో పదివేల కోట్ల డాలర్ల వరకు త్యాగం చేసిందుకైనా ఆర్బీఐ సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరోవైపు గడచిన కొన్ని నెలల్లో ఆర్బీఐ వద్దనున్న విదేశీ మారక నిధుల సైతం భారీగా తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆల్ టైం రికార్డ్ స్థాయి 64,245 కోట్ల డాలర్లకు చేరిన ఫారెస్ట్ నిలువలు 6000 కోట్ల డాలర్లకు పైగా తగ్గి ప్రస్తుతం 58 వేల కోట్ల డాలర్ స్థాయికి పడిపోయాయి. మారక విలువలో మార్పు తో పాటు రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఫారెక్స్ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్లను విక్రయించాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణం అయింది.అయినప్పటికీ అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిలవలు ఉన్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. కాగా రూపాయికి మరింత బలం చేకూర్చేందుకు మరిన్ని ఫారెక్స్ నిలువలను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని ప్రభుత్వం ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.