Rudram 2 Missile: భారత్ రక్షణ శాఖ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన రుద్రం–2 యాంటీ–రేడియేషన్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ శత్రువు రాడార్‌లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గుర్తించి ధ్వంసం చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది.
రుద్రం–2 సామర్థ్యాలు ఇవీ…
రుద్రం–2 ప్రధానంగా శత్రువు రాడార్లు వెలువరించే రేడియేషన్ సిగ్నల్స్‌ను గుర్తించి, వాటిని కచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగిన అధునాతన మిస్సైల్. ఇది 300 నుంచి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పిన్‌పాయింట్ ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. గంటకు సుమారు 7,000 కిలోమీటర్ల వేగంతో (మాక్ 5.5) ప్రయాణించే ఈ మిస్సైల్ శత్రువుకు తక్కువ సమయంలోనే తీవ్ర నష్టం కలిగించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది కేవలం రాడార్లను మాత్రమే కాకుండా, సమగ్ర ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లు, సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ బ్యాటరీలు, కమాండ్ సెంటర్లను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడింది.
పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్‌కు సవాల్..
పాకిస్తాన్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రాడార్లు, సామ్ మిస్సైళ్లు, ఫైటర్ జెట్లపై ఆధారపడి నిర్మించింది. రుద్రం–2 వంటి మిస్సైల్ ఈ రాడార్ నెట్‌వర్క్‌ను మొదట ధ్వంసం చేస్తే, శత్రువు సమగ్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంది. రాడార్లు లేకపోతే ఫైటర్ జెట్లు సమర్థవంతంగా పని చేయలేవు. ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లు కూడా లక్ష్యం గుర్తించడంలో విఫలమవుతాయి. ఈ కారణంగానే రుద్రం–2ను బ్యాటిల్ ఫీల్డ్ షేపర్ (యుద్ధభూమిని తీర్మానించేది) అని పిలుస్తున్నారు. ఇది శత్రువు ఆకాశ ప్రాధాన్యతను కూడా దెబ్బతీసే సామర్థ్యం కలిగి ఉంది.
మూడు ప్రయోజనాలు..
రుద్రం–2 విజయవంతమైన పరీక్ష భారత్‌కు మూడు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. మొదటిది సీ సామర్థ్యం పెరగడం. మిషన్లలో భారత్ ఇప్పుడు స్వయంప్రతిపత్తి సాధించింది. శత్రువు రక్షణ వ్యవస్థలను దూరం నుంచే నాశనం చేయడం ద్వారా భారత్ వైమానిక దళం యొక్క ఫైటర్ జెట్లు సురక్షితంగా ఆపరేట్ చేయవచ్చు.
పాకిస్తాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడి..
పాకిస్తాన్ రాడార్ నెట్‌వర్క్ ఎప్పుడు ధ్వంసమవుతుందో అనే భయం శత్రువు సైనికుల్లో వణుకు పుట్టిస్తుంది. ఇది దేశీయ సాంకేతికతపై ఆధారపడిన అధునాతన ఆయుధం కావడం విశేషం.
రుద్రం–2 విజయం భారత్ ఆక్రమణాత్మక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసింది. యుద్ధ సమయంలో శత్రువు ఎయిర్ డిఫెన్స్‌ను తట్టుకోవడం ఇక ముందు చాలా కష్టమవుతుందని స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక మిస్సైల్ పరీక్ష కాదు భారత్ యుద్ధ వ్యూహాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

