https://oktelugu.com/

Rosaiah Chandrababu: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కత్తితో పొడిచి కుర్చీ లాక్కునే వాడిని.. చంద్రబాబుతో రోశయ్య వ్యాఖ్యలు వైరల్

Rosaiah Chandrababu : తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ యాసలో తిడుతుంటే బూతులు అయినా సరే వినసొంపుగా ఉంటాయి. అలా ఏపీ రాజకీయాల్లో కొణిజేటి రోశయ్యకు ఆ వాగ్ధాటి ఉంది. ఆయన సెటైర్లు, పంచులకు తెలుగుదేశం స్థాపించిన ఎన్టీఆర్ సైతం బెంబేలెత్తిపోయిన శాసనమండలిని ఎత్తివేశారంటే రోశయ్య ఘనాపాఠిని అర్థం చేసుకోవచ్చు. రోశయ్య ధాటికి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆరే కాదు.. ఆయన నుంచి పార్టీని తీసుకున్న చంద్రబాబు కూడా బాధితుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది వైఎస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2021 / 02:18 PM IST
    Follow us on

    Rosaiah Chandrababu : తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ యాసలో తిడుతుంటే బూతులు అయినా సరే వినసొంపుగా ఉంటాయి. అలా ఏపీ రాజకీయాల్లో కొణిజేటి రోశయ్యకు ఆ వాగ్ధాటి ఉంది. ఆయన సెటైర్లు, పంచులకు తెలుగుదేశం స్థాపించిన ఎన్టీఆర్ సైతం బెంబేలెత్తిపోయిన శాసనమండలిని ఎత్తివేశారంటే రోశయ్య ఘనాపాఠిని అర్థం చేసుకోవచ్చు.

    Rosaiah chandrababu

    రోశయ్య ధాటికి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆరే కాదు.. ఆయన నుంచి పార్టీని తీసుకున్న చంద్రబాబు కూడా బాధితుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన రోజులు. 2004లో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ఆర్ సీఎం అయ్యారు. వైఎస్ఆర్ కేబినెట్ లో సీనియర్ మోస్ట్ నేత రోశయ్య ఆర్థిక-శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు.

    Also Read: రోశయ్య రాజకీయంలో మీకు తెలియని గొప్పతనాలు ఇవీ

    ఈ క్రమంలోనే చంద్రబాబును ఉతికి ఆరేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఆయన నటుడు కావడంతో డ్రామా కంపెనీ అని రోశయ్య ఆరోపించాడని చంద్రబాబు తిట్టిపోశాడు. రోశయ్య డమ్మీ మంత్రి అని ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడే పెట్టేవాడని.. తెలివి తక్కువ వాడు కోపం ఎక్కువ అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

    దీనికి మైక్ నందుకున్న రోశయ్య రెచ్చిపోయారు. చంద్రబాబులా నాకూ తెలివి ఉంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కత్తితో వెన్నుపోటు పొడి ఆయన కుర్చీ లాగేసుకునేవాడిని.. ఈయన దాకా ఎందుకు చెన్నారెడ్డినే ఇలా పొడిచి సీఎం అయ్యేవాడిని.. నీ అంత తెలివి నాకు లేదు చంద్రబాబు అంటూ మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చరిత్రను నిండు సభలో ప్రస్తావించి రోశయ్య నిప్పులు చెరిగిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    వీడియో

     

    Also Read: చిరంజీవిని రాజకీయాల్లోకి తెచ్చి.. వైఎస్ఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా మారి.. రోశయ్య ప్రస్థానం