Minister Roja: ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇప్పుడు సినిమాల్లో గెలిచి నిలిచి రాజకీయాల్లోనూ గెలిచిన వారు కొందరే ఉన్నారు. నాడు ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత తెలుగు రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి దెబ్బైపోయారు. ఆయన తర్వాత చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఆశించిన రాజకీయాలు చేయలేకపోతున్నారు. వీరే కాదు.. సినిమాల్లో వెలుగు వెలిగి రాజకీయాల్లో విజయాలు సాధించిన వారు కొందరు ఉన్నారు.
తెలుగు నాట ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్తాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అంతకుముందు తమిళనాట ఎంజీఆర్ కూడా ఏఐడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. తాజాగా ఏపీ మంత్రిగా ఒకప్పటి హీరోయిన్ .. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె కంటే ముందు ఇలా మంత్రులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేసిన కొందరున్నారు. వారి గురించి తెలుసుకుందాం..
ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ ను కలిసి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. అనంతరం ఆయన కుమారుడు జగన్ పార్టీలో చేరి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక రెండో విడతలో రోజాకు మంత్రి పదవి ఇచ్చాడు జగన్. గత మూడేళ్ల క్రితం కేబినెట్ ర్యాంకు కు సమానమైన ‘ఏపీఐఐసీ’ చైర్మన్ పదవిని ఇచ్చాడు. ప్రస్తుతం చాలా రోజుల ఆశ తీరడంతో మంత్రిగా రోజా ఆనందంగా ఉన్నారు.
-రోజా సినిమా జీవితం
రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఓ సినిమా ద్వారా రోజా హీరోయిన్ గా పరిచయమైంది. తర్వాత ‘సర్పయాగం’ మూవీలో శోభన్ బాబు పక్కన నటించి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా సక్సెస్ తో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో రోజా వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రోజా. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినా ప్రజలకు చేరువై మూడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. రెండోసారి 2019లో గెలిచారు. మొదటి దఫా మంత్రి పదవి దక్కలేదు. రెండో దఫాలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. రాజకీయాల్లోకి రెండు సార్లు ఓడిపోయా ఎక్కడా కృంగిపోకుండా.. పట్టుదలతో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంత్రి అయిన రోజాది ఒక రికార్డ్ గా చెప్పొచ్చు.
తొలిసారి సామాజిక సమీకరణాల్లో రెడ్డి అయిన రోజాకు మంత్రి పదవి దక్కలేదు. హోంమంత్రి అవుతుందని అందరూ అనుకున్నా నెరవేరలేదు. రోజా అసంతృప్తిని గ్రహించి జగన్ ‘ఏపీఐఐసీ’ చైర్మన్ పదవినిచ్చి గౌరవించారు. కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లో కొనసాగుతూనే ‘జబర్ధస్త్’ లాంటి కామెడీ షోలు, టీవీ షోలు చేశారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు మెయింటేన్ చేశారు. ఇప్పుడు రెండో దఫాలో మంత్రి కావడంతో సినిమా, టీవీ షోలను ఆపేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రిగా ప్రజాసేవకే సమయం కేటాయిస్తానని ప్రకటించారు.
-రోజా కంటే ముందే సినిమాల్లో వెలుగు వెలిగిన రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. తెలుగు నాట ఎన్టీఆర్, తమిళనాట ఎంజీఆర్ సీఎంలుగా వెలుగు వెలిగారు.ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జయలలిత ఏకంగా తమిళనాడు సీఎం అయ్యారు. ఇక దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంగ్రెస్ లో చేరి కేంద్రమంత్రి అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ‘ప్రజారాజ్యం’ పెట్టి ఫెయిల్ అయిపోయి తిరిగి రాజకీయాల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ లో పార్టీని కలిపేసి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా వదిలేశారు.
-కాకినాడ బీజేపీ ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు కేంద్రమంత్రిగా వాజ్ పేయి కేబినెట్ లో పనిచేశారు.
-టీడీపీలో రాజకీయం ఆరంభించిన బాబు మోహన్.. అప్పట్లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు.
-చిత్తూరుజిల్లాకు చెందిన నటుడు శివప్రసాద్.. ఆ జిల్లా ఎంపీగా గెలిచి టీడీపీ హయాంలో వెలుగు వెలిగారు. విచిత్రమైన వేషాలతో తన మార్క్ చూపించారు.
వీరే కాదు.. సినిమాల్లో రాణించిన బాలీవుడ్ అలనాటి హీరో శత్రుఘ్న సిన్హా, బాలీవుడ్ నటుడు సునీల్ దత్,తమిళ నటుడు నెపొలియన్ , దివంగత నటుడు అంబరీష్ , వినోద్ ఖన్నా, సృతి ఇరానీలు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా వెలుగు వెలిగారు.