
ప్రముఖ తమిళ నటి ప్రాణాపాయంలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లాంగ్ డ్రైవ్ పేరిట విహారయాత్రకు స్నేహితులతో వెళ్లిన వారి యాత్ర విషాదయాత్రగా మిగిలింది.
తమిళనాడులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కోలీవుడ్ నటి , బిగ్ బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమె స్నేహితులురాలు ప్రాణాలు కోల్పోయారు. వీకెండ్ సందర్భంగా శనివారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి యాషిక మహాబలిపురం లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. అర్తరాత్రి 1 గంట సమయంలో వీరు కారు అతి వేగంగా వెళుతూ అదుపుతప్పి డీవైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యాషికా స్నేహితురాలు భవానీ అక్కడికక్కడే మృతి చెందింది.
తీవ్రంగా గాయపడిన యాషిక, ఆమె మరో ఇద్దరు స్నేహితులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.
యాషిక తమిళనాట ప్రముఖ నటిగా ఫేమస్.. ‘దురవంగల్ పత్తినారు’తో వెండితెరకు పరిచయం అయ్యారు. అనంతరం కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రియాల్టీ షోలోనూ సందడి చేశారు.