https://oktelugu.com/

Mohammed Rizwan : బాబూ రిజ్వాన్.. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ప్రత్యర్థిని అడిగి ఆ పని చేస్తావా? వైరల్ వీడియో

ఎట్టకేలకు మూడు వన్డేల సిరీస్ లో పాకిస్తాన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఏడు సంవత్సరాల అనంతరం విజయాన్ని సొంతం చేసుకుంది.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డేలో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 / 05:01 PM IST

    Mohammed Rizwan

    Follow us on

    Mohammed Rizwan : ఈ మ్యాచ్ లో ముందుగా పాకిస్తాన్ జట్టు బౌలింగ్ చేసింది.. పాకిస్తాన్ బౌలర్లు హారీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది, నసీం షా మెరుపులు మెరిపించారు. నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పాకిస్తాన్ బౌలర్లు ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వారు ఆడుతున్న విధానం చూస్తే గల్లి క్రికెటర్లు గుర్తుకు వచ్చారు. ఆస్ట్రేలియా జట్టులో స్మిత్ చేసిన 35 పరుగులే టాప్ స్కోర్ అంటే వాళ్ల బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బౌన్సీ మైదానాలపై పాకిస్తాన్ బౌలర్లు అద్భుతమైన పేస్ ను రాబట్టారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. హరీస్ రౌఫ్ ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇద్దరు బౌలర్లే వేగంగా 8 వికెట్లు నేల కూల్చారంటే వీళ్ళ బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరో యువ బౌలర్ నసీం షా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ మైదానం బౌలింగ్ కు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచిన పాకిస్తాన్.. బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు.

    మైదానంలో ఆసక్తికర సంఘటన..

    అయితే ఈ మ్యాచ్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో నసీం షా 34 ఓవర్ వేశాడు. అతడు వేసిన బౌన్సర్ ను బలమైన షాట్ కొట్టడానికి స్ట్రైకర్ గా ఉన్న ఆడం జంపా ప్రయత్నించాడు. అయితే బంతి దూరంగా వెళ్లిపోయింది. అయితే దీనిని అంపైర్ వైడ్ అని ప్రకటించారు. క్యాచ్ అందుకున్న పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ అవుట్ కోసం ఫీల్డ్ అంపైర్ కు ఆపిల్ చేశాడు. అయితే ఇతర ఆటగాళ్లు అతడికి సహకరించలేదు.. ఈ క్రమంలో..” నువ్వు ఎలాంటి శబ్దమైన విన్నావా” అంటూ రిజ్వాన్ జంపాను ప్రశ్నించాడు. ” నువ్వు అన్నింటికీ ఎంపైర్ ను విసిగిస్తున్నావు. అప్పిల్ వేసేస్తున్నావని” జంపా అతడికి బదులు ఇచ్చాడు..” ఇప్పుడు ఈ బంతికి రివ్యూ తీసుకోమని చెబుతావా” అని రిజ్వాన్ అన్నాడు. ” దానికి పోయేదేముంది.. నీ ఇష్టం తీసుకోవచ్చు” అని జంపా అడ్వైజ్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత రిజ్వాన్ సమీక్ష కోరాడు. ఆ బంతి పడిన విధానాన్ని పరిశీలనలోకి తీసుకున్న థర్డ్ అంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో పాకిస్తాన్ ఒక రివ్యూ నష్టపోవాల్సి వచ్చింది. జంపా వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా రిజ్వాన్ షాక్ కు గురయ్యాడు.. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 రన్స్ కు చాప చుట్టేసింది. దానిని పాకిస్తాన్ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేదించింది.