https://oktelugu.com/

Rising prices : ధరల దెబ్బ… పడిపోతున్న అమ్మకాలు

Rising prices :  దేశంలో పెట్రో ధరల పెంపు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కరోనా విలయం తర్వాత అన్నిరంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా పెట్రోల్, డీజిల్‌ ధరల ఇబ్బడిముబ్బడి పెంపుతో అమ్మకాలు క్షీణించాయి. రోజువారీ ధరల విషయానికొస్తే ఆదివారం ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డీజిల్‌ రేట్లు, పెట్రోల్‌ ధరలు మోయలేని భారంగా మారిన క్రమంలో ఆయిల్‌ కంపెనీలు సామాన్యులపై కరుణను కొనసాగిస్తున్నాయి. వరుసగా 11వ రోజూ పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకోలేదు. అయితే ఏప్రిల్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2022 / 03:29 PM IST
    Follow us on

    Rising prices :  దేశంలో పెట్రో ధరల పెంపు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కరోనా విలయం తర్వాత అన్నిరంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా పెట్రోల్, డీజిల్‌ ధరల ఇబ్బడిముబ్బడి పెంపుతో అమ్మకాలు క్షీణించాయి.

    Petrol, Diesel

    రోజువారీ ధరల విషయానికొస్తే ఆదివారం ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డీజిల్‌ రేట్లు, పెట్రోల్‌ ధరలు మోయలేని భారంగా మారిన క్రమంలో ఆయిల్‌ కంపెనీలు సామాన్యులపై కరుణను కొనసాగిస్తున్నాయి. వరుసగా 11వ రోజూ పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకోలేదు. అయితే ఏప్రిల్‌ నెలలో అమ్మకాలు మాత్రం భారీగా తగ్గిపోయాయి.

    – తెలంగాణలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు నిలకడగా ఉన్నాయి. ఇవాళ పెట్రోల్‌ ధర లీటరుకు రూ.119.49గా, డీజిల్‌ ధర రూ.105.49 గా ఉంది.

    – ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడలో పెట్రో ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌ లీటరుకు రూ.0.18 పైసలు తగ్గి రూ.121.32గా ఉంది. డీజిల్‌ ధర రూ.0.19 పైసలు తగ్గి రూ.106.90 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ రూ.120.00, డీజిల్‌ రూ.105.65గా ఉంది.

    – దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.41, లీటర్‌ డీజిల్‌ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్‌ రూ.105.86, డీజిల్‌ రూ.97.10గా ఉంది.

    – దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు చివరిసారిగా ఏప్రిల్‌ 6న పెరిగాయి. గడిచిన 11 రోజులుగా కంపెనీలు ధరలను పెంచలేదు. అయితే మార్చిలో కొనసాగిన బాదుడు కారణంగా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు ఏకంగా 10 శాతం పడిపోయాయి.

    – పెరిగిన ఇంధనాల ధరలతో అమ్మకాలు తగ్గాయి. ఏప్రిల్‌ ప్రథమార్ధం (1వ తేదీ నుంచి 15 వరకు) వరకు పెట్రోల్‌ అమ్మకాలు 10 శాతం, డీజిల్‌ విక్రయాలు 15.6 శాతం తగ్గిపోయాయి. ఎల్పీజీ అమ్మకాలు కూడా చాలా వరకు తగ్గాయి.

    – నిజానికి కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతూ రావడంతో మార్చి నెలలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాల్లో జోరు కనిపించింది. కానీ అదే నెలలో ధరలు భారీగా పెంచడంతో ఏప్రిల్‌ 1–15 మధ్యకాలంలో దీని వినియోగం తగ్గింది.