Rishi Sunak: ఏ దేశమేగినా… ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని… నిలపరా నీ జాతి నిండు గౌరవం.. అప్పుడెప్పుడో రాయప్రోలు సుబ్బారావు మహాశయుడు రాసిన వ్యాఖ్యలు ఇవి. వీటిని నిజం చేసి చూపించారు బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్. తాను పాలిస్తున్న దేశానికి చెందిన బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రసారం చేసిన డాక్యుమెంట్రీపై రిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డాక్యుమెంటరీ పై పాకిస్తాన్ మూలాలు ఉన్న ఓ బ్రిటన్ ఎంపీ బ్రిటన్ పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు రిషి ఘాటుగా సమాధానం చెప్పారు. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లకు సంబంధించి బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా అంతర్గత నివేదిక ఆధారంగా ఎటువంటి విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.. దీనిపై అటు బ్రిటన్ లో, ఇటు ఇండియాలో నిరసనలు చెలరేగుతున్నాయి. పరిశీలన, పరిశోధన వంటివి చేయకుండానే ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయడం పట్ల బీబీసీ విశ్వసనీయత పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ” ఇందులో వలసవాదం, సంకుచిత మనస్తత్వం, వ్యతిరేకమైన ఆలోచన” ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని భారత మూలాలు ఉన్న బ్రిటన్ పౌరులు ఆరోపిస్తున్నారు.

ఇక మొన్న గురువారం బ్రిటన్ పార్లమెంటులో భారత ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ పై ఆ దేశ ఎంపీ, పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి…” 2002లో జరిగిన గుజరాత్ హింసా ఖాండకు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యుడు. దీనిని ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్ నిర్ధారించింది. వందలాది మందిని తీరాకంగా చంపేశారు.. వారి కుటుంబ సభ్యులు, భారత్, బ్రిటన్ లో ఉంటున్నారు. వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఫారిన్ ఆఫీస్ లోని దౌత్యవేతలు ఈ హింసాకాండ కు బాదుడుడు మోడీ అని చెప్తున్నారు. వారితో రుషి సునాక్ ఏకీభవిస్తారా?. తీవ్రమైన నరమేధంలో మోడీ ప్రమేయం గురించి ఫారిన్ ఆఫీసుకు ఇక ఏమేం తెలుసని” ప్రశ్నించారు. కాకపోతే ఆ పాకిస్తాన్ మూలాలు ఉన్న ఎంపీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే… తన మాతృదేశం పాకిస్థాన్లో హిందువులను ఏవిధంగా చూస్తున్నారో? వాళ్లు పూజించే గుడులను ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో? హిందూ మహిళలను ఏ విధంగా హింసిస్తున్నారో… దీని గురించి ఆ సో కాల్డ్ ఎంపి మాట్లాడడు.. ఎందుకంటే ఇజ్జత్ మొత్తం పోతుంది కాబట్టి..
గట్టిగా కౌంటర్ ఇచ్చాడు
దీనిపై రుషి సునాక్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు..” మిస్టర్ ఎంపీ ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. అది చిరకాలం ఉంటుంది.. దానిలో మార్పు లేదు.. అయితే అణచివేత ఎక్కడ జరిగిన నేను సహించబోం.. అలాగని బిబిసి డాక్యుమెంటరీ తో మేము ఏకీభవించలేం.. అది వాళ్ళ దేశానికి సంబంధించిన సమస్య. ఆ డాక్యుమెంటరీ కూడా పరిశోధన చేసి రూపొందించింది అని నేను అనుకోవడం లేదు.” అని బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యానించారు.. అంతేకాకుండా ఒకరిపై విమర్శలు చేసే ముందు మన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని సదరు పాకిస్తాన్ మూలాలు ఉన్న ఎంపీ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇక బ్రిటిష్ నేషనల్ బ్రాడ్ కాస్టర్ మోడీపై రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరినీ ప్రసారం చేసింది. 2002 గుజరాత్ లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెబుతూ, ఆయన నేతృత్వంలోనే ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో పలు విమర్శలు చేసింది.. ఇక దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ వలసవాద ఆలోచన ధోరణి ని వెల్లడిస్తోందని అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలని లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆయన ఆరోపించారు.. నిస్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచన ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం స్పష్టమవుతున్నాయని పేర్కొన్నారు.