Rishi Sunak బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ రాజీనామాతో తలెత్తిన సంక్షోభానికి తెరదించుతూ బ్రిటన్ కు కొత్త ప్రధానిగా మన భారతీయుడే ఎన్నిక కావడం విశేషం. మనల్ని పాలించిన బ్రిటీష్ వారిని మనమే పాలించే అరుదైన అవకాశం ఈ సందర్భంగా దక్కింది. రిషి సునాక్ మన ఇన్పోసిస్ నారాయణ మూర్తి అల్లుడు కావడం విశేషం.

లిజ్ ట్రస్ రాజీనామానాతో సంక్షోభ పరిస్థితుల్లో జరిగిన అంతర్గత ఎన్నికల్లో కన్జర్వేటివ్ టోరీ సభ్యులు ఈసారి లిజ్ ట్రస్ చేతుల్లో ఓడిపోయిన ఆర్థిక మేధావిగా పేరు తెచ్చుకున్న రిషి సునాక్ వైపే మొగ్గు చూపారు. రిషికి 172 మంది ఎంపీల మద్దతు లభించింది. నిజానికి152 మద్దతు చాలు. దానికంటే ఎక్కువగానే మద్దతు పలకడం విశేషం. బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్దంట్ ఇద్దరూ పోటీనుంచి తప్పుకోవడంతో బ్రిటన్ ప్రధానిగా రిషిసునాక్ ఎన్నికయ్యారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషిసునాక్ కు వరించింది.
నెలరోజుల క్రితం ఓటమిపాలైన అదే సునాక్.. నేడు దేశ ప్రధానిగా ఘన విజయం సాధించారు. బ్రిటన్ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
చివర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎంపీల మద్దతు విషయంలో రిషిసునాక్ తో పోలిస్తే తక్కువ మంది మద్దతు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు లభించింది. దీంతో బరిలోంచి తప్పుకుంటున్నట్టు బోరిస్ జాన్సన్ అనూహ్యంగా ప్రకటించారు. కీలకనేతగా ఉన్న బోరిస్ వైదొలగడం.. పోటీలో ఉన్న మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్ కు అంతంత మాత్రమే మద్దతు ఉండడంతో బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ విజయం దాదాపు ఖాయమైనట్టే. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.