Rishi Sunak: బ్రిటన్ లో ఎన్నికల నగారా మోగింది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధమవుతోంది. కొత్త ప్రధాని ఎవరనేది సెప్టెంబర్ 5న తేలనుంది. అధికార కన్జర్వేటివ్ పార్టీ పోటీకి దిగనుంది. అధికార పార్టీ తరఫున ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి కి స్వయాన అల్లుడైన రిషి సునాక్ పోటీలో నిలవడం గమనార్హం. 20 మంది ఎంపీల మద్దతుతో రిషి ఎన్నికల్లో గెలిచి ప్రధాని పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు అన్ని దారులు వెతుకుతున్నారు.
రిషికి బ్రిటన్ రవాణా శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ మద్దతు ఉంది. దీంతో జాన్సన్ మంత్రివర్గంలో మొదట రాజీనామా చేసింది రిషి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాబోయే ప్రధాని రేసులో రిషి ముందుండటంతో విజయం ఖాయమనే దీమాలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఇండియాకు చెందిన వ్యక్తి బ్రిటన్ లో ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడటం విశేషమే. కానీ విజయం సాధిస్తే మరీ సంచలనంగా మారనుంది. దీంతో రిషి ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది.
Also Read: Dara Singh Death Anniversary: దారాసింగ్ వర్ధంతి: ఈ ‘అభినవ హనుమాన్’ గురించి ఆశ్చర్యపరిచే విషయాలివీ!
జాన్సన్ పరిపాలనలో దేశం అభివృద్ధి కుంటుపడింది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, అప్పుల భారం, కుంటుపడిన పురోగమనం అన్ని సమస్యలు వెంటాడాయి. దీంతో ఆయన ప్రభుత్వంలోని రిషితో పాటు కొందరు మంత్రులు రాజీనామా చేయడంతో జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. దీంతోనే ఎన్నికలు అనివార్యమయ్యాయి. జాన్సన్ స్వయంకృతాపరాధంతోనే ఆయన తన పదవికి ఎసరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
రిషితో పాటు పదిమంది పోటీలో ఉంటారని భావిస్తున్నారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వారిని ఎలిమినేట్ చేస్తారు. చివరకు ఇద్దరు మిగులుతారు. వారే ఒకరు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా మరొకర ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారు. రిషి జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో రిషికే మద్దతు ప్రకటిస్తారనే వాదనలు వస్తున్నాయి. మొత్తానికి రిషి గెలిస్తే ఓ సంచలనమే నమోదు కానుంది. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రిగా నియమించబడటమంటే మామూలు విషయం కాదు. అదో చరిత్ర అవుతుంది. కానీ రిషి గెలవాలని అందరు ఆకాంక్షిస్తున్నారు.
Also Read:Sudigali Sudheer- Hyper Aadi: సుడిగాలి సుధీర్ కి అవమానం ? షాకింగ్ విషయాలు చెప్పిన హైపర్ ఆది
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Rishi sunak is active in the campaign indian origin rishi sunak leading uk pm race
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com