The Warrior: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా తమిళ టాప్ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వం లో తెరెకెక్కిన ‘ది వారియర్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అద్భుతమైన మాస్ ట్రైలర్ మరియు దేవిశ్రీప్రసాద్ అందించిన బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఈ సినిమా పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగేలా చేసాయి..ఇక ఈ చిత్రం ఉప్పెన ఫేమ్ క్రితి శెట్టి హీరోయిన్ గా నటించగా..ప్రముఖ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు..రామ్ మరియు ఆది మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందట..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబందించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..అదేమిటి అంటే ఈ సినిమాని తొలుత తెలుగు లో ఒక స్టార్ హీరో తో ప్లాన్ చేశారట డైరెక్టర్ లింగు సామి..అప్పట్లో తెలుగు మరియు తమిళం బాషలలో ఈ సినిమా ని ఒకేసారి తెరకెక్కిద్దాం అనుకున్నారు ..కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆ స్టార్ హీరో నుండి రామ్ చేతిలోకి వెళ్ళింది.

ఇక అసలు విషయానికి వస్తే లింగు సామి అప్పట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని హీరో గా పెట్టి తెలుగు మరియు తమిళం బాషలలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఒక సినిమాని తీద్దాం అనుకున్నారు..ఇందుకోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా అధికారికంగా ప్రకటించారు అప్పట్లో..ఈ ప్రెస్ మీట్ కి అల్లు అర్జున్, లింగు సామి మరియు స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ కి చెందిన వారు హాజరయ్యారు..DJ సినిమా సమయం లో ఈ ప్రాజెక్ట్ ప్రకటన జరిగింది..అయితే ఆ సమయం లో అల్లు అర్జున్ నటించిన DJ మరియు నా పేరు సూర్య వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయాయి..అప్పుడు అల్లు అర్జున్ స్క్రిప్ట్ ఎంపిక విషయం లో పునరాలోచనలో పడ్డాడు.
Also Read: Sudigali Sudheer- Hyper Aadi: సుడిగాలి సుధీర్ కి అవమానం ? షాకింగ్ విషయాలు చెప్పిన హైపర్ ఆది

ఎందుకో లింగు సామి ప్రాజెక్ట్ రిస్క్ అని గమనించిన అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్ ని పక్కకి నెట్టేసి అల వైకుంఠపురం లో మరియు పుష్ప సినిమాల్లో నటించాడు..ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాలుగా నమోదు చేసుకున్నాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇక అల్లు అర్జున్ ఈ ప్రజెక్టు నుండి తప్పుకునేలోపు హీరో రామ్ కి ఈ స్టోరీ ని వినిపించాడు లింగు సామి..ఆయనకీ బాగా నచ్చడం తో ఈ కథని వెంటనే ఒప్పుకొని ఈరోజు ‘ది వారియర్’ గా మన ముందుకి వచ్చాడు..మరి అల్లు అర్జున్ రిస్క్ గా భావించి పక్కన పెట్టిన ఈ స్క్రిప్ట్ , హీరో రామ్ కి కలిసి వస్తుందా లేదా అనేది తెలియాలంటే రేపటి వరుకు ఆగాల్సిందే.
Also Read:Charmy Kaur: ‘హీరోయిన్ల’ వ్యాపారం ప్లాన్ చేస్తున్న మాజీ హీరోయిన్
[…] Also Read:The Warrior: షాకింగ్.. వారియర్ సినిమాని మిస్ చ… […]