https://oktelugu.com/

Petrol Prices: జస్ట్ ఎన్నికల కోసమే ఆగారు.. మోడీ సార్ ‘పెట్రో’ వాతలకు.. జనాలు రెడీగా ఉండండి..

Petrol Prices:  ఏరు దాటేదాక.. ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటామా? ఇక ‘బోడ మల్లన్నే’. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పరిస్థితి ప్రస్తుతం ఇలానే తయారైంది. దేశంలో కరోనా కల్లోలం తర్వాత కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రజల నుంచి డబ్బులు పిండడమే ధ్యేయంగా పెట్టుకుంది కేంద్రప్రభుత్వం. అగ్గిపుల్ల, సబ్బు బిల్లు.. కాదేది పెంచడానికి అనర్హం అన్నట్టుగా అన్నింటిపై బాదేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను జెట్ స్పీడులా పరుగులు పెట్టిస్తోంది. ప్రజలను ఠారెత్తిస్తోంది. పట్టపగ్గాల్లేకుండా పరిగెడుతున్న పెట్రోమంట జనాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2022 / 11:29 AM IST
    Follow us on

    Petrol Prices:  ఏరు దాటేదాక.. ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటామా? ఇక ‘బోడ మల్లన్నే’. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పరిస్థితి ప్రస్తుతం ఇలానే తయారైంది. దేశంలో కరోనా కల్లోలం తర్వాత కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రజల నుంచి డబ్బులు పిండడమే ధ్యేయంగా పెట్టుకుంది కేంద్రప్రభుత్వం. అగ్గిపుల్ల, సబ్బు బిల్లు.. కాదేది పెంచడానికి అనర్హం అన్నట్టుగా అన్నింటిపై బాదేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను జెట్ స్పీడులా పరుగులు పెట్టిస్తోంది. ప్రజలను ఠారెత్తిస్తోంది. పట్టపగ్గాల్లేకుండా పరిగెడుతున్న పెట్రోమంట జనాలకు బాగానే వాతపెడుతోంది. అందుకే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీకి ఈ పెట్రో సెగ తగులుతోంది. అందుకే రెగ్యులర్ గా పెట్రోల్, డీజిల్ పెంచే మోడీ సర్కార్ గత మూడు నెలలుగా స్థిరంగా ఉంచింది. అయితే ఇది మున్నాళ్ల ముచ్చటేనని.. ఐదురాష్ట్రాల ఎన్నికల ముగియగానే మోడీ సార్ వాతపెట్టడం ఖాయమని తెలుస్తోంది.

    modi. petrol prices

    పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ప్రస్తుతానికి మోడీసార్ జనాలకు కాస్త ఉపశమనం ఇచ్చారు. అది ఐదు రాష్ట్రాల ఎన్నికల వల్లే.. మార్చి 7న ఉత్తరప్రదేశ్ లోని చివరి దశ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలను భారీగా పెంచేందుకు మోడీ సర్కార్ రెడీగా ఉందట.. నవంబర్ 4 నుంచి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు దాదాపు 14 డాలర్లు మేర పెరిగాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపును కేంద్రం ప్రజలపై భారం మోపలేదు. దీంతో చమురు కంపెనీలే ఈ నష్టాలను భరించాయి.

    Also Read:   కరణ్ జోహార్ ని జైల్లో బంధిస్తోందట.. బిగ్ బాస్ ను బీట్ చేస్తోందా ?

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పెట్రోల్, డీజిల్ పై పన్నులను తగ్గించకపోతే ఇది ద్రవ్యోల్బణానికి మరింత దోహదం చేస్తుందని విశ్లేషకులు భయపడుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం.. భారతదేశం దిగుమతి చేసుకునే ముడిచమురు ధర సోమవారం బ్యారెల్ కు రూ.94.56కు పెరిగింది. అక్టోబర్ 2014 తర్వాత ఇదే అత్యధిక ధర. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.

    2014లో మోడీ సర్కార్ ఇంధన ధరలపై నియంత్రణను ఎత్తేసింది. అప్పటి నుంచి ఎంత పెరిగినా చమురు కంపెనీలు వినియోగదారులపై భారం వేస్తూ ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోయాయి. అయితే ఎన్నికల సందర్బంగా వ్యతిరేకత వస్తుందని గత మూడు నెలలుగా మోడీ సర్కార్ ఈ పెట్రోల్ ధరలను పెంచకుండా స్తంభింపచేసింది. ఈ ఎన్నికలు ముగియగానే మోడీ సర్కార్ జూలు విదిల్చడం ఖాయం.. పెట్రోల్ రేటు 150 పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకు సిద్ధమవ్వడం తప్ప మనం చేసేది ఏం లేదు.

    Also Read:  జగన్ కొట్టలేదట.. నమ్మండి అంటున్నాడు..