RGV vs Jagan: రామ్ గోపాల్ వర్మ రాత్రి పగలు తేడా లేకుండా చిత్ర పరిశ్రమ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. సినిమా టికెట్స్ ధరలు తగ్గింపు చర్యలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ట్విట్టర్ వేదిక తన మాటలు తూటాలు సంధిస్తున్నాడు. అదే సమయంలో చట్టాలు గురించి ప్రస్తావిస్తూ… తన లాజిక్కులు వివరిస్తున్నారు. ధరలు తగ్గింపు నిర్ణయానికి వ్యతిరేకంగా వర్మ రోజుకు పదుల సంఖ్యలో ట్వీట్స్ వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని స్వయంగా కలిసి సమస్య గురించి చర్చించారు.

చర్చల తర్వాత కూడా వర్మ సోషల్ మీడియాలో తన కామెంట్స్ దాడి తగ్గించలేదు. టికెట్స్ ధరలు విషయాన్ని వర్మ ఇంత సీరియస్ గా తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. ఆయన సీఎం జగన్ అభిమాని, అనుకూలుడన్న వాదన పరిశ్రమలో, జనాల్లో ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సినిమాలు చేసే వర్మ.. జగన్ విషయంలో మాత్రం అలాంటివి చేయరు. పైపెచ్చు సీఎం జగన్ క్యారెక్టర్ గురించి పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే సీఎం జగన్ తత్త్వం తెలిసినవారెవ్వరూ ఆయనతో మొండిగా గొడవకు దిగరు. ప్రభుత్వం తరపు నుండి ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు. వ్యతిరేకంగా పోరాటం చేస్తే మాత్రం జగన్ మరింత ప్రమాదకరంగా తయారవుతాడు. రెండున్నరేళ్ల పాలన చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. జగన్ తీసుకున్న నిర్ణయంపై ఎన్ని విమర్శలు తలెత్తినా, చివరికి దాని వలన తనకు నష్టం జరుగుతుందని తెలిసినా వెనక్కి తగ్గడు. కోర్టు జోక్యం చేసుకుంటే తప్పా… ససేమిరా ఎవడి మాటా వినడు. ఆ కోర్టులతో కూడా ఎప్పుడూ పోరాటాలే.
Also Read: ఆర్జీవీతో ఏపీ ప్రభుత్వం చేతులు కాలాయా?
క్రింది కోర్టులో ప్రతికూల తీర్పు వస్తే పై కోర్టుకి వెళతారు. సినిమా టికెట్స్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35 ను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చినా.. వై ఎస్ జగన్ అప్పీల్ కి వెళ్లారు. కాగా వర్మ చేసే ఈ పోరాటం జగన్ ని మరింత మొండిగా మార్చేసే జరిగే నష్టం బడా నిర్మాతలకే అని చెప్పాలి. వర్మ నిజాయితీగా పరిశ్రమ కోసం ఈ పోరాటం చేస్తున్నా…. లేక ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నా ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు.
ఆయన పోరాటం ఫలించి సీఎం జగన్ టికెట్స్ ధరలు ఏపీలో పునరుద్ధరిస్తే భేష్. వర్మకు మంచి పేరు వస్తుంది. అదే సమయంలో వర్మ చర్యలతో సీఎం జగన్ మరింత మొండిగా వ్యవహరిస్తే నష్టం మాత్రం నిర్మాతలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే జరిగితే బడా నిర్మాతలందరూ మటాషే.
Also Read: లాక్ డౌన్ పోస్ట్ పోన్: ఫ్రెండ్ కు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చిన జగన్
[…] Kodali Nani, Vangaveeti Radha: ఏపీలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మొన్నటివరకు సైలంట్ అయిన కరోనా మరోసారి పంజా విసరడంతో రోజువారీగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మంగళవారం ఒక్కరోజే 1800లకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టినా కొత్తగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోనే వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. […]
[…] […]
[…] Bhumana Abhinay: ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పాలన చేస్తుందనే దానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. గతంలో తాము చెప్పిన వారికి రుణాలివ్వలేదని బ్యాంకుల ముందు చెత్త పోసిన ఘటన మరువక ముందే ఇప్పుడు తిరుపతి ఎయిర్ పోర్టు అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు స్థానిక లీడర్లు. ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బంది ఉండే కాలనీకి నీటి సరఫరా ఆపేశారు. ఎయిర్ పోర్టులో కూడా దాదాపు అదే పరిస్థితి. చేసేదేమీ లేక అధికారులు ట్యాంకర్లతో వాటర్ తెప్పించుకుంటుంటే మరమ్మత్తుల పేరుతో ఏకంగా రోడ్లన్నీ తవ్వించారు. ఎందుకు ఇలా చేస్తోంది జగన్ ప్రభుత్వం అంటే స్థానిక డిప్యూటీ మేయర్‌ను విమానాశ్రయ అధికారులు అవమానించడమే అని తెలుస్తోంది. […]