Homeజాతీయ వార్తలుRGV comments on Vijay: విజయ్ కి గెలిచిన ఆనందాన్ని దూరం చేసిన ఆర్జీవీ..మరీ ఇంత...

RGV comments on Vijay: విజయ్ కి గెలిచిన ఆనందాన్ని దూరం చేసిన ఆర్జీవీ..మరీ ఇంత మాట అనాలా..

RGV comments on Vijay: ఊరు మొత్తం ఒకదారిలో వెళ్తుంటే.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరొక దారిలో వెళ్తుంటారు. తన దారిలో రావాలని ఎవరిని ఆయన అడగరు. బలవంతం కూడా చేయరు. జస్ట్ తన మానానా తాను వెళ్ళిపోతుంటారు. అలాగని ఆయన నిశ్శబ్దంగా ఉండే రకం కాదు. గెలికి మరీ వాసన చూసే రకం. అందువల్లే ఆర్జీవికి విపరీతమైన అభిమానులు ఉంటారు. ఆయన హిట్ సినిమా తీస్తే భుజాలకు ఎత్తుకుంటారు. ఫ్లాప్ సినిమా తీస్తే తిట్టిపోస్తారు. ఎలాగైనా సరే ఆర్జీవిని తమ ఆలోచనలలో ఉండేలా చేసుకుంటారు.

వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ఆలోచింపజేసే మాటలు మాట్లాడటం కూడా ఆర్జీవికి వచ్చు. ఒక స్త్రీని ఎలాగైతే ఆయన విలాస వస్తువుగా చెబుతుంటారో.. ఒక స్త్రీని కాపాడుకోవడం దేశ బాధ్యత అని వివరించి చెబుతుంటారు. ఆయనలో ఒక యోగి ఉన్నాడు. ఒక భోగి ఉన్నాడు.. అన్నింటికీ మించి సుఖి కూడా ఉన్నారు. అందువల్లే ఆయన ఏం చేసినా సరే సంచలనంగానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో వ్యవస్థను ప్రశ్నిస్తుంటారు. కొన్ని సందర్భాలలో మంచిని సమర్థిస్తుంటారు. ఎలాగైనా సరే తాను వార్తల్లో ఉండాలని కోరుకుంటారు.

ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో ఈసారి సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో తమిళనాడులో టీవీకే పార్టీ ఘనవిజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినప్పటికీ… అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారం సొంతం చేసుకోవడానికి ఆ పార్టీకి ఇంకా 11 స్థానాలు అవసరమవుతాయి. ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ సడన్గా ఎంట్రీ ఇచ్చారు. అందరూ విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే.. ఆయన మాత్రం విభిన్నంగా గ్రీటింగ్స్ చెప్పారు. సోషల్ మీడియాను దీనికోసం వాడుకున్నారు. ఒక పాత ఫోటోను వెలికి తీసి మరి విజయ్ కి గ్రీటింగ్స్ చెప్పారు.

రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఆ ఫోటోలు డీఎంకే అధినేత కరుణానిధి ఉన్నారు. ఆయన ఏదో ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆయన వెనుక విజయ్ కూడా ఉన్నారు. అప్పట్లో విజయ్ యువకుడిగా ఉన్నారు.. సరిగ్గా ఇదే ఫోటోను రాంగోపాల్ వర్మ పోస్ట్ చేశారు..” నాడు యువకుడిగా ఉన్న విజయ్ కరుణానిధి పక్కన ఉన్నారు. నాడు తన పార్టీని విజయ్ నాశనం చేస్తారని.. నామరూపాలు లేకుండా చేస్తారని కరుణానిధి ఊహించి ఉండరని” రాంగోపాల్ వర్మ రాసుకొచ్చారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ విజయ్ కి గెలిచిన ఆనందాన్ని దూరం చేసినట్టు ఉందని సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేయడంలో రాంగోపాల్ వర్మ డిఫరెంట్ స్టైల్ కొనసాగించారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version