Homeఎంటర్టైన్మెంట్Prabhas Fauji movie car accident: నుజ్జు నుజ్జు అయిన ప్రభాస్ 'ఫౌజీ' కారు.. సంచలనం...

Prabhas Fauji movie car accident: నుజ్జు నుజ్జు అయిన ప్రభాస్ ‘ఫౌజీ’ కారు.. సంచలనం రేపుతున్న ఫోటోలు.. ఆందోళనలో ఫ్యాన్స్..

Prabhas Fauji movie car accident: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం ‘ఫౌజీ'(Fauji Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అయితే నేడు ఉదయం ఈ చిత్రం షూటింగ్ కోసం వెళ్తున్న చిత్ర బృందానికి సంబంధించిన యూనిట్ సభ్యుల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, తూప్రాన్ పేట వద్ద జరిగిన విషాద సంఘటనలో ఒకరు మృతి చెందగా , 5 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. నేడు ఉదయం మూవీ యూనిట్ కి సంబంధించిన స్టాఫ్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక్కడికి వెళ్తున్న సమయం లో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలం వద్దకు చేరుకొని సహాయ చర్యలు మొదలు పెట్టారు. హాయపడిన వారిని సమీపం లోని హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తుండగా , మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

సినిమా షూటింగ్ విరామం లేకుండా ఎంతో ఉత్సాహంతో జరుగుతున్న ఈ సమయం లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మూవీ యూనిట్ ని తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తమ సానుభూతి వ్యక్తం చేసిన యూనిట్ , భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని మాట ఇచ్చింది. మరోపక్క పోలీసులు ఈ ప్రమాదం జరగడం పై విచారణ చేపడుతున్నారు. ఇక ఈ ఘటన కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం , ప్రభాస్ అభిమానులు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వంటివి జరిగాయి. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితి లోనూ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఒకవేళ దసరా మిస్ అయితే , వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం కచ్చితంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక మూవీ వివరాల్లోకి వెళ్తే హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోంది. రజాకార్ ఉద్యమం జరుగుతున్న సమయం లో ఇండియన్ సైనికుడికి, పాకిస్థాన్ అమ్మాయి కి మధ్య జరిగిన ప్రేమ కథ ఇది. లవ్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో, యాక్షన్ సన్నివేశాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతానికి కేవలం 3 యాక్షన్ బ్లాక్ సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందట. జులై లోపు పూర్తి అవుతుందని అంటున్నారు. ‘రాజా సాబ్’ ఫెయిల్యూర్ తో డీలాపడిన ప్రభాస్ ఫ్యాన్స్, ‘స్పిరిట్’ చిత్రం మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా విడుదల అయ్యేలోపు ‘ఫౌజీ’ ని విడుదల చేసి భారీ హిట్ కొట్టే ప్లాన్ లో ఉన్నాడు ప్రభాస్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version