Bandi Sanjay: ఈ మధ్య తెలంగాణలో కూడా ఆంధ్రా తరహా రివేంజ్ పాలిటిక్స్ బాగా కనిపిస్తున్నాయి. దాంతో ఏమీ లేని చోట ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ విషయంలో ఈ తరహా పాలిటిక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ ఎస్ చేస్తున్న పని వల్ల బీజేపీకే ప్లస్ అవుతుందని గులాబీ అధిష్టానం కనిపెట్టలేకపోతోంది. పోనీ దాని పర్యవసానం వారికి తెలియదా అంటే ఇప్పటికీ వారికి అనుభవమే.
అయినా కూడా ఈ తరహా రివేంజ్‌పాలిటిక్స్‌ను ఆపట్లేదు. అసలు వాస్తవంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కావాలని లేపుతున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అంతకు ముందు బీజేపీని పెద్ద సీరియస్‌గా తీసుకోని టీఆర్ ఎస్.. ఇప్పుడు పనిగట్టుకుని వారిని తిట్టే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారు. మొట్ట మొదటి సారి బండి సంజయ్ మీద ఇలాంటి రివేంజ్ పాలిటిక్స్ జరిగింది ఆర్టీసీ సమ్మె సమయంలో. అప్పుడు ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకోవడంతో.. ఆయన శవంతో ధర్నా చేయాలని ప్రయత్నించగా.. సంజయ్ మీద పోలీసుల దాడి జరిగింది.
Also Read: YCP Politics: వైసీపీలో కట్టుదాటుతున్న క్రమశిక్షణ.. కట్టడి చేయలేకపోతున్న జగన్
అప్పటి నుంచే సంజయ్ హైలెట్ కావడం స్టార్ట్ అయ్యాడు. పాలిటిక్స్ ఎవరి మీద ఎక్కువ దాడి జరుగుతుందో వారి గురించే ప్రజలు, మీడియా, కార్యకర్తలు అందరూ చర్చించుకుంటారు. తద్వారా ఆటోమేటిక్‌గా వారు హైలెట్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడైనా దెబ్బ తిన్నవారిమీదే సింపతీ ఉంటుంది కదా. అదే సంజయ్‌కు ప్లస్ అవుతోంది.
పైగా సంజయ్ ఏదైనా యాత్ర లేదంటే పరామర్శ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సమయంలోనే ఆయనమీద దాడులు జరుగుతున్నాయి. దాంతో ఆ కార్యక్రమానికి ఎక్కడ లేని పబ్లిసిటీ వస్తోంది. సంజయ్ ప్రజల కోసం పోరాడుతుంటే కావాలని అడ్డుకుంటున్నారని బీజేపీ శ్రేణులు ప్రచారం చేసి.. ప్రజల్లో ఆయన ఇమేజ్‌ను పెంచుకుంటున్నారు.
దుబ్బాక ఎలక్షన్ల సమయంలో సంజయ్ మీద పోలీసుల దాడిని అన్ని పార్టీలు ముక్తం కంఠంతో ఖండించాయి. రేవంత్ రెడ్డి కూడా దాన్ని తీవ్రంగా విమర్శించారంటే.. సంజయ్‌కు ఎంత పాజిటివ్ నేమ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఖమ్మంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ పర్యటించిన నేపథ్యంలో కూడా టీఆర్ ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో మరింత సింపతీ వచ్చింది.
ఇలా ప్రతిసారి సంజయ్‌ను కావాలనే టీఆర్ ఎస్ దాడి చేసి ఎక్కడ లేని సింపతీ తీసుకు వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఇవన్నీ చాలవన్నట్టు మొన్న సంజయ్ తన క్యాంప్ ఆఫీసులో ఉద్యోగుల బదిలీలు సక్రమంగా జరగాలంటూ దీక్ష చేస్తుంటే.. దాన్ని కూడా అడ్డుకుని దేశ వ్యాప్తంగా ఆయన్ను ఫేమస్ చేసి పడేశారు. ఇక అతన్ని జైలుకు తరలించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ తోపు లీడర్లంతా వచ్చి టీఆర్ ఎస్‌ను విమర్శించి వెళ్లారు.
అప్పట్లో ఈ విషయం నేషనల్ మీడియాలో కూడా హైలెట్ అయిపోయింది. అంటే సంజయ్ ఏది చేసినా దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించి.. చివరకు సంజయ్‌ను ఫేమస్ చేస్తున్నారన్న మాట. ఇక ఈరోజు జోగులాంబ గద్వాల నుంచి సంజయ్ రెండో విడత పాదయాత్ర చేస్తుంటే.. దాన్ని కూడా టీఆర్ ఎస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ ఎస్ కార్యకర్తలకు మధ్య పెద్ద గొడవ జరిగింది.
దీంతో ఈ పాదయాత్రకు కూడా మళ్లీ ఫుల్ కవరేజీ వచ్చేసింది. ఆయన పాదయాత్ర గురించి తెలియని వారికి కూడా ఈ ఘటనతో అందరికీ తెలిసేలా చేశారు. ఇలా మొత్తంగా సంజయ్‌ను ప్రతి విషయంలో తొక్కేయాలని చూసి.. చివరకు ప్రజల్లో ఆయన్ను లీడర్‌ను చేసేస్తున్నారు. గతంలో ఏపీలో జగన్‌ను ఇలాగే అనవసరంగా ప్రతి విషయంలో చంద్రబాబు గెలుక్కుంటే.. చివరకు జగన్‌ను ప్రజలు ఆదరించారు.
అక్కడ జగన్ మంచోడా చెడ్డోడా అని ఆలోచించలేదు. చంద్రబాబు తొక్కేయాలని చూస్తున్నాడు కాబట్టి.. ప్రజలు సానుభూతి చూపించారు. అయితే ఇప్పుడు జగన్ అసలు రూపం అందరికీ తెలుస్తోంది. అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం తెలంగాణలో సంజయ్ విషయంలో కూడా టీఆర్ ఎస్ ఇదే పాలసీ అమలు చేస్తోంది.
దాంతో సోషల్ మీడియాలో టీఆర్ ఎస్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అడ్డుకోవడం ఎందుకు అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. దాంతో నియంతృత్వ పాలన అనే అపవాదును మూటగట్టుకుంటున్నారు టీఆర్ ఎస్ అధినేత.
Also Read:KCR Federal Front: ఫెడరల్ ఫ్రంట్ కథ ముగిసినట్టేనా..? గులాబీ బాస్ కు ఇలా షాక్ తగిలిందేంటి..?
Recommended Videos