Operation Sindoor: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మతం అడిగి మరీ హిందువులను చంపేశారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్‌ఐఏ విచారణ జరిపి ఈ దాడి జరిపించి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులని గుర్తించింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వంద మంది ఉగ్రవాదులను చంపేసింది.
పాకిస్తాన్ ప్రతిదాడి..
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ప్రతిదాడులు మొదలు పెట్టింది. దీంతో భారత సైన్యం ఈ దాడులను తిప్పి కొట్టింది. ఇదే సమయంలో పాకిస్తాన్‌లోని కీలక స్థావరాలపై దాడిచేసింది. భారత్ దాడులకు పాకిస్తాన్ వణికిపోయింది. అమెరికా, చైనా, టర్కీ సహకారం అందించినా పాకిస్తాన్ భారత్ దాడులను ఎదుర్కొనలేకపోయింది.
చివరకు కాళ్లబేరానికి..
భారత్ దాడులు తట్టుకోలేక అమెరికా వద్ద పాకిస్తాన్ మోకరిల్లింది. చివరకు అమెరికా సూచనతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీమ్ మునీర్ కాళ్లబేరానికి వచ్చారు.
మే 10, 2025న పాకిస్తాన్ డీజీఎంవో భారత డీజీఎంవోతో చర్చలు జరిపారు. యుద్ధం ఆపమని వేడుకున్నారు. అప్పటికే భారత లక్ష్యం నెరవేరడంతో భారత్ కూడా దాడులు ఆపేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో మే 10ని ప్రతీకార దినంగా జరుపుకుంటున్నాం. ఇదే సమయంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ను హోల్డ్‌లో ఉంచుతున్నట్లు తెలిపింది. ఎప్పుడైనా దాడులకు తెగబడితే ఆపరేషన్ సిందూర్ 2.0 మొదలు పెడతామని స్పష్టం చేసింది.
పహల్గాంలో మారణహోమం..
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సమీపంలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఉగ్రవాదులు హిందూ పర్యాటకులపై కాల్పులు జరిపారు. 26 మంది మరణించి, 20 మంది గాయపడ్డారు. పాక్ ప్రేరేపిత ఈ దాడి దేశవ్యాప్త ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనికి 14 రోజుల్లో స్పందనగా మే 7 తెల్లవారుజామున 1:44 గంటలకు ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. భారత వాయుసేన అర్ధరాత్రి మెరుపు దాడులతో పీవోకేలోని ముజఫ్ఫరాబాద్, కోట్లి, పాక్ పంజాబ్‌లోని బహావల్పూర్‌లోని 9 ఉగ్ర శిబిరాలు, శిక్షణా కేంద్రాలను క్షిపణులతో ధ్వంసం చేసింది. 1:45కి 24 దాడులు పూర్తయ్యాయి. 100+ ఉగ్రవాదులు మొత్తం ధ్వంసం అయ్యారు.
4 రోజుల ఆపరేషన్..
మే 7 నుంచి 10 వరకు 4 రోజులు సాగిన ఈ ఆపరేషన్‌లో భారత్ 50 కంటే తక్కువ ఆయుధాలతో క్షిపణి, వైమానిక దాడులు చేసింది. పాక్ 11 ఎయిర్‌బేస్‌లు, ఎఫ్–16లు, ఏడబ్ల్యూఏసీ విమానాలు, 5 ఫైటర్ జెట్‌లు కూల్చివేయబడ్డాయి. పాక్ సీజ్‌ఫైర్‌కు ఒత్తిడి చేసి దాడులు ఆపించింది. భారత్ 25 గగనతల మార్గాలు మూసివేసి పాక్‌ను ఇబ్బంది పెట్టింది.
ఆపరేషన్ సిందూర్ భారత్ ప్రొపోర్షనల్ రెస్పాన్స్ వ్యూహాన్ని బలపరిచింది.ఉగ్ర స్థావరాలపై మాత్రమే దాడి, పౌరులకు నష్టం లేకుండా. ఉరి, పుల్వామా తర్వాత ఇది మరో మైలురాయి. పాక్ పాఠ్యపుస్తకాల్లో ’విక్టరీ’గా చిత్రీకరించడం దాని డీనయల్ మానసికతను చూపిస్తుంది. కాళ్లబేరా ‘దేవుడే రక్షించాడు‘ అని చెప్పినా, భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది.