Martyrs Stupa: తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణం రాజకీయం అవుతోంది. ప్రభుత్వం 2017 నుంచి ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా దీని నిర్మాణానికి ఆంధ్రా కాంట్రాక్టర్ ను నియమించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. స్తూపం నిర్మాణానికి ప్రభుత్వం ఇంకా ఎన్నేళ్లు తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వారి గుర్తింపుకు నిర్మించే స్తూపం నిర్మాణంలో ఆంధ్రావారిని నియమించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
లుంబిని పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మించాలని 2017లో పనులు ప్రారంభించారు. కానీ దాని నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. అంచనా వ్యయం మాత్రం రూ. 63 కోట్ల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.127 కోట్లకు చేరడం గమనార్హం. ఏటికేడు వ్యయం పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం దాని నిర్మాణం పూర్తి చేసేందుకు శ్రద్ధ మాత్రం కనబరచడం లేదని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ నేతలుగా ఎదిగిన టీఆర్ఎస్ నేతలు అమరవీరుల స్తూపం నిర్మాణంపై ఏమాత్రం చొరవ చూపడం లేదని తెలుస్తోంది. దీంతోనే దాని నిర్మాణం ఆలస్యమవుతూనే ఉంది. దీంతో ప్రజల్లో కూడా అసహనం పెరిగిపోతోంది. స్తూపం నిర్మాణంపై నేతల్లో అలసత్వం ఎందుకో అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఆంధ్రా వారికి కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Ch. Vittal: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పోరుబిడ్డ సీహెచ్. విఠల్ ప్రస్థానం
తెలంగాణ సెంటిమెంట్ ను ఆంధ్రా వాళ్లకు తాకట్టు పెట్టడంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం కాంట్రాక్టర్ ఆంధ్రావాళ్లు కాదని బుకాయిస్తు్నా సదరు కంపెనీ కేపీసీ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినదిగా చెబుతున్నారు. దీంతో కాంట్రాక్టర్ విషయంలో వివాదాలు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది.
Also Read: TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ ఉన్నారా?