Homeజాతీయ వార్తలుRevanth Reddy: రేవంత్‌రెడ్డి సక్సెస్ సీక్రెట్‌ అదే!

Revanth Reddy: రేవంత్‌రెడ్డి సక్సెస్ సీక్రెట్‌ అదే!

Revanth Reddy: ఎన్నికల ఏడాది.. అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ను టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. సీనియర్లు సహాయ నిరాకరణ చేస్తున్నా.. హైకమాండ్‌ ఆశీస్సులతో దూకుడు పెంచుతున్నాడు. సీనియర్లతో సంబంధం లేకుండా అధిష్టానం మెప్పు పొందేందుకు, ప్రజల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అందించ్చిన ప్రతీ అవశాకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి తనదైన శైలిలో బల ప్రదర్శన చేస్తున్నాడు.

డిక్లరేషన్లతో దూకుడు..
డిక్లరేషన్ల పేరుతో రేవంత్‌ పార్టీ హైకమాండ్‌ పెద్దలను రప్పించి సభలు పెడుతున్నారు. అవన్నీ సక్సెస్‌ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్‌ పెద్ద దిక్కు అన్న అభిప్రాయాన్ని వారిలో కల్పిస్తున్నారు. గతంలో వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీతో ప్రకటింపచేశారు. అందులో కీలకమైన హామీగా ధరణి పోర్టల్‌ రద్దు అంశం ఉంది. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ హామీ బాగా ఆకట్టుకుంది. తాము ఇచ్చిన హమీని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్‌ రెడ్డి విస్తతమైన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ప్రియాంకాగాంధీ ఓ బహిరంగసభలో పాల్గొనేందుకు ఇచ్చిన రెండు, మూడుగంటల సమయాన్ని రేవంత్‌రెడ్డి అత్యుత పకడ్బందీగా ఉపయోగించుకున్నారు. యువ సంఘర్షణ సభ పేరుతో సభ పెట్టి యువతకు గుక్క తిప్పుకోలేనన్ని ఆపర్లు ఇచ్చారు. యూత్‌ డిక్లరేషన్‌∙ప్రకటించి.. అందరూ చర్చించుకునేలా చేశారు.

జనం నమ్మేలా.. హామీలు
ఎన్నికల హామీలు ఇవ్వడం కాదు.. వాటిని ప్రజలతో నమ్మేలా చేయడం కీలకం. తెలంగాణ కాంగ్రెస్‌ అధిపత్య పోరాటంతో ప్రజలు .. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో.. ఎవరు హామీలకు బాధ్యత తీసుకుంటారో ప్రజలకు స్పష్టత ఉండదు. అందుకే ఈ హామీలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లవు. అందుకే రేవంత్‌ మాత్రం రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలను తెరపైకి తెచ్చారు. ఈ డిక్లరేషన్ల హామీ బాధ్యత మాదని వారు ప్రకటించడంలోనే రేవంత్‌ వ్యూహం ఉందని చెబుతున్నారు.

సీనియర్లు అడ్డుపుల్ల వేస్తున్నా..
రేవంత్‌ దూకుడుతో సహాయ నిరాకరణలో ఉన్న సీనియర్లు ఖంగుతింటున్నారు. అధిష్టానం దృష్టిలో రేవంత్‌ హీరో అవుతుండడం, సహాయ నిరాకరణతో తాము జీఓ అవుతున్నామన్న భావన వారిలో నెలకొంటోంది. ఈ క్రమంలో సీనియర్లు .. ఎప్పటికప్పుడు రేవంత్‌ రెడ్డిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌ కూడా వారిపై ఆధిపత్యం చూపించాలని అనుకోవడం లేదు. తగ్గే ఉంటున్నారు. అయితే చాన్స్‌ వచ్చినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి కార్యాచరణ ప్రకటిస్తున్నారు. కీలెరిగి సీనియర్లకు వాత పెడుతున్నారు. దీంతో సీనియర్ల వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రియాంకా గాంధీ సభతో రేవంత్‌ కాస్త పైచేయి సాధించారని అనుకోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular