https://oktelugu.com/

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు రేవంత్ అడుగులు.. సాధ్యమయ్యేనా?

Revanth Reddy: మల్కాజ్‌గిరి ఎంపీ ఏ.రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన నేపథ్యంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో కొంత జోష్ అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రాకను స్వాగతిస్తూ సంబురాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్రమంతా విస్తృత పర్యటనలు చేయబోతున్నారు. పాదయాత్రలు కూడా చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు టాక్. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 20, 2021 / 03:52 PM IST
    Follow us on

    Revanth Reddy: మల్కాజ్‌గిరి ఎంపీ ఏ.రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన నేపథ్యంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో కొంత జోష్ అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రాకను స్వాగతిస్తూ సంబురాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్రమంతా విస్తృత పర్యటనలు చేయబోతున్నారు. పాదయాత్రలు కూడా చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు టాక్. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ల మద్దతు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Revanth Reddy

    కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ నేతలందరితోనూ రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న నేపథ్యం చూస్తుంటే వారిని సైతం మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు అర్థమవుతున్నది. ఈ క్రమంలోనే రేవంత్ పార్టీలో ప్రక్షాళన చేయాలనుకుంటున్నారట. అదేంటంటే.. గ్రామస్థాయి నుంచి మొదలుకుని జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి వరకు ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ కమిటీలన్నిటినీ పూర్తిగా మార్చేయాలని అనుకుంటున్నట్లు టాక్..కాంగ్రెస్ పార్టీ కోసం నికరంగా పని చేస్తున్న నేతలకు అవకాశాలిస్తూ కేడర్‌లోనూ కొంత జోష్ నింపేందుకుగాను మొత్తం కమిటీలన్నిటినీ రేవంత్ ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని రేవంత్ అనుమతి కోరబోతున్నట్లు సమాచారం.

    మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో యువరక్తాన్ని ఇంజెక్ట్ చేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడేవారికి అవకాశాలిచ్చా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని రేవంత్ ప్లాన్ చేసినట్లు వినికిడి. ఆ లెక్కన పీసీసీ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులతో పాటు కార్యదర్శులు అందరినీ మార్చేసి, పని చేసే వారికే పగ్గాలు ఇస్తామనే సంకేతాలను రేవంత్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు , భవిష్యత్తులో ఇక ఎప్పుడూ అంతర్గత సమస్యలు రాకుండా ఉండాలంటే పార్టీలో ప్రక్షాళన అవసరమని రేవంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన డిఫరెంట్ ప్లాన్స్ వేస్తున్నట్లు అర్థమవుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు చర్చించుకుంటున్నారు.

    Also Read: KCR on BJP : కేసీఆర్ సారు ఆదేశించడాలేనా..? పాటించడాల్లేవా??

    పార్టీలో ఉన్న కోవర్టులకూ చెక్ పెట్టేందుకుగాను రేవంత్ ప్రక్షాళన అవసరమని భావిస్తున్నట్లు అర్థమవుతున్నది. అయితే, పార్టీలో రేవంత్ మార్కు ప్రక్షాళనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓకే చెప్తుందా లేదా అనేది ప్రజెంట్ కీలక అంశంగా ఉంది. ఒకవేళ అధిష్టానం నుంచి రేవంత్ సూచనలకు పర్మిషన్ లభించినట్లయితే పార్టీలో మరింత జోష్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. నూతనోత్తేజంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పని చేస్తారని అంటున్నారు. ఏదేని పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలే కీలకమని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

    Also Read: Employee Separation Process: ఉద్యోగుల విభజన.. ప్రభుత్వ నిర్ణయంతో తర్జనభర్జన

    Tags