https://oktelugu.com/

తహసీల్దార్ కోటి లంచంలో రేవంత్ రెడ్డికి లింక్?

తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు లంచావతరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా 1.10 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు నాగరాజు పట్టుబడడం పెను సంచలనమైంది. ఏకంగా ఓ భూ వ్యవహారంలో కోటి రూపాయలు లంచం డిమాండ్ చేసిన వైనం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. Also Read: తెలంగాణ లో హై అలెర్ట్ : కరోనా ని మించిన ముప్పు తహసీల్దార్ నాగరాజుపై జరిగిన దాడిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2020 / 01:20 PM IST
    Follow us on


    తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు లంచావతరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా 1.10 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు నాగరాజు పట్టుబడడం పెను సంచలనమైంది. ఏకంగా ఓ భూ వ్యవహారంలో కోటి రూపాయలు లంచం డిమాండ్ చేసిన వైనం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

    Also Read: తెలంగాణ లో హై అలెర్ట్ : కరోనా ని మించిన ముప్పు

    తహసీల్దార్ నాగరాజుపై జరిగిన దాడిలో కంటికి కనిపించని అవినీతి ఉందా? అంటే ఔననే అంటున్నాయి అధికార వర్గాలు. నాగరాజు అవినీతి పరుడని.. అంతకుముందే ఆయనపై కేసు నమోదైందని సమాచారం.

    కాగా తెలంగాణలో పాలక టీఆర్ఎస్ పార్టీ.. ఈ కేసును తమ ప్రత్యర్థి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మెడకు చుట్టేందుకు ప్రయత్నిస్తుందా అంటే ఔననే ప్రచారం తాజాగా సాగుతోంది.

    అయితే ఈకేసులో షాకింగ్ నిజం ఏంటంటే.. ఈ అవినీతి లంచం కేసులో రేవంత్ రెడ్డి కోణం కూడా కనిపిస్తోంది. తహసీల్దార్ నాగరాజుతోపాటు అరెస్ట్ చేసిన వారిలో ఒకరు కందాడ అంజిరెడ్డి. ఇతడు కాంగ్రెస్ నాయకుడు కావడం గమనార్హం. రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడని సమాచారం. దీంతో ఈ కేసును రేవంత్ రెడ్డి మెడకు చుట్టేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

    Also Read: తెలంగాణకు రెండో రాజధాని? ఏదంటే?

    రేవంత్ రెడ్డి అనుచరుడు అరెస్ట్ కావడంతో ఈ కేసులో రేవంత్ ప్రమేయంపై ఆరాతీయాలని టీఆర్ఎస్ సర్కార్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రేవంత్ కు సంబంధించి లింక్ ను వెలికితీసి ఈ కేసులో ఇరికించాలని పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. పోలీసులు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. దొరికితే రేవంత్ ను బుక్ చేయడానికి టీఆర్ఎస్ సర్కార్ అన్ని అవకాశాలను పరిశీలిస్తోందట..