Malla Reddy vs Revanth Reddy: టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబమే. కానీ, తన తర్వాతి లక్ష్యం మంత్రి మల్లారెడ్డే అన్నట్లు వ్యవహరిస్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో మల్లారెడ్డి కాలేజీలు, భూకబ్జాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి. తాజాగా రైతు రచ్చబండ పేరుతో సోమవారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం లక్ష్మాపూర్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామం కావడంతో రేవంత్ రెడ్డి సహజంగానే స్థానిక మంత్రిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక్కడి ప్రజలు చేసుకున్న దురదృష్టం మల్లారెడ్డి మంత్రి కావడమని వ్యాఖ్యానించారు. మైసమ్మకు విడిచిన దున్నపోతులా మల్లారెడ్డి బలుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మల్లారెడ్డి భూములను స్వాధీనం చేసుకుంటామని, ఆయన కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. అయితే టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తర్వాత ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది మల్లారెడ్డినే. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

బ్లాక్‌మెయిలింగేనా..?
మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కలిసి టీడీపీలో పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాత మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే మల్లారెడ్డిపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, పేదల భములు ఆక్రమించారని, ఆయన నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు మంత్రికి వాటా ముట్టజెప్పాల్సిందే అని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో గతంలో మంత్రి వాయిస్ రికార్డు కూడా బయటకు వచ్చింది. అయినా సీఎం కేసీఆర్ మల్లారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌గా ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరూ కలిసి ఒక పార్టీలో పనిచేసిన వీరు ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ మల్లారెడ్డి ఆస్తులపై ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి మల్లారెడ్డి ఆరోపించినట్లు రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలింగ్ కోసమే ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారా అన్న సందేమాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ బిడ్డపెళ్లి మల్లారెడ్డే చేశారా?
రేవంత్‌రెడ్డికి ఏకైక కుమార్తె ఉంది. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఆమె కూతురును కూడా రాజకీయల్లోకి లాగారు. రేవంత్‌రెడ్డి పెళ్లి తానే చేశానని యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి సాక్షిగా ఒట్టేసి చెప్పారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌రెడ్డి తన కూతురు పెళ్లి కూడా చేయలేని స్థితిలో ఉన్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ ప్రశ్నలకు రేవంత్ సమధానం చెబుతారా?
రేవంత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై స్పనందించిన మంత్రి మల్లారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి రేవంత్‌పై మండిపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు ఏశారు. బ్లాక్‌మెయిలర్‌గా అభివర్ణించారు. ఇదే సమయంలో రేవంత్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటికి రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మల్లారెడ్డి సంధించిన ప్రశ్నలు..
– రేవంత్‌రెడ్డి టీడీపీలో తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. నాపై చంద్రబాబుకు అబద్దాలు చెబితే తానే స్వయంగా చంద్రబాబుకు వాస్తవాలు చెప్పి టికెట్ తెచ్చుకున్నానని చెప్పారు.
– రేవంత్‌కు ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి. రేవంత్ మంత్రిగా పనిచేయలేదు. బిజినెస్ చేయలేదు, వ్యవసపాయం చేయలేదు. కానీ కోట్లకు పడగలెత్తారు. పీసీసీ చీఫ్ పదవి కొనేంత సంపాదించారు. ఇందతా బ్లాక్‌మెయిలింగ్ ద్వారానే సంపాదించారు.
– మొదటి నుంచి రేవంత్‌రెడ్డి చీటరే. డబ్బుల కోసం ఎంతకయినా తెగిస్తాడు. పదవులను అడ్డు పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. చాలామంది రేవంత్ బాధితులు ఉన్నారు.
– రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉంటే అది నాశనం అవుతుంది. టీడీపీని అలాగే బ్రష్టుపట్టించారు. ఇపుపడు కాంగ్రెస్ ఖతం అవుతుంది. తర్వాత రేవంత్ బీజేపీలో చేరుతారు.
– రెడ్డి కులం గురించి కర్ణాటకలో గొప్పగా చెప్పిన రేవంత్‌రెడ్డి మాత్రం రెడ్డి కులంలో పుట్టిన చీడపురుగు. కులాన్ని అడ్డుపెట్టుకుని మోసాలు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతాడు.
Also Read:YSRCP MLC Anantha Babu: డెడ్ బాడీని వదలని ఎమ్మెల్సీ అనంతబాబు.. డ్రైవర్ చనిపోయాక ఏం చేశాడో తెలుసా?
[…] […]