Renuka Chowdhury Battiఈ కాంగ్రెసోళ్లు మరీ బరితెగించేశారు.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు చేసిందే ఈ అవినీతి పని. దానికి విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ పాడుపనికి మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రచ్చ చేయడం ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టే అర్థం కావడం లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనలు హోరెత్తాయి. ఢిల్లీ ఆందోళనల్లో ఓ కాంగ్రెస్ ఎంపీని పోలీసులు దుస్తులు చింపేశారని ఆమె బోరుమన్న వీడియో వైరల్ అయ్యింది.
ఇక తెలంగాణలో మాత్రం పాపం పోలీసులపైనే కాంగ్రెస్ నేతలు దాడులకు దిగడం విస్మయ పరుస్తోంది. హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. ఖైరతాబాద్ జంక్షన్ లో బైక్ ను తగులబెట్టారు. ఆర్టీసీ బస్సుపై దాడి చేసి అద్దాలు పగులకొట్టారు. డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకొని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క దురుసుగా ప్రవర్తించాడు. ఇక ఎస్ఐ కాలర్ పట్టుకొని మాజీ ఎంపీ రేణుకాచౌదరి చేసిన రచ్చ అంతా ఇంతాకాదు..
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రేణుకా చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పోలీసులపైనే దాడి చేసిన భట్టి విక్రమార్క్, రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నేతలు చేసేదే అసలు ప్రజా ఉపయోగం లేని ఆందోళన.. ఇలాంటివి ప్రజల కోసం చేస్తే వాళ్లు ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాళ్లు. కానీ అధినేతల అవినీతి కేసులకు నిరసనగా చేయడమే ప్రజల్లోకి కాంగ్రెస్ కు మంచి పేరు రాకుండా చేస్తోంది. సోనియా, రాహుల్ విచారణపై ప్రజలను ఇబ్బంది పెడుతూ రచ్చ చేసిన కాంగ్రెస్ నేతలపై జనాలు భగ్గుమంటున్నారు. పైగా పోలీసులపైనే దాడి చేసిన వీరిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎవరైనా ప్రజల కోసం.. వారి సమస్యలపై పోరాటం చేస్తారు. కానీ ఈ కాంగ్రెస్ నేతలు తమ అధినేత అవినీతిపై కేసుల గురించి పోరాడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ కాంగ్రెస్ ఇలా ఉండబట్టే జనాల ఆదరణ కరువవుతోంది. ఇంకా ఎప్పటికి ఈ పార్టీ మారుతుందో చూడాలి.