Renu Desai- JanaSena: సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. సృజనశీలురు ఎక్కువైపోయారు. దీంతో సోషల్ మీడియాలో తమ క్రియేటివిటీని అంతా జోడించి అందరినీ ఆకర్షించే పోస్టులను చేస్తున్నారు. అస్సలు కలవని జంటలను ‘వాట్సాప్ యూనివర్సిటీ’లో కలిపేస్తున్నారు.. శత్రువులను మిత్రులు చేస్తున్నారు. ట్రంప్, ఎలన్ మస్క్ లాంటి వారిపై మీమ్స్ జోడించి పిచ్చోళ్లను చేస్తున్నారు. సోషల్ మీడియాకు ఏదైనా సాధ్యమే.

ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్.. ‘జనసేన పార్టీలో చేరిన రేణుదేశాయ్?’ మంచి థంబ్ నేల్ పెట్టి మరీ జనాలు దీన్ని వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఇది నిజమా?అబద్ధమా? అని ఆరాతీస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నాక ఫూణే వెళ్లిపోయిన రేణుదేశాయ్ ఒక వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇక పవన్-రేణుల ఇద్దరి సంతానం ప్రతీ పండుగకు నాన్న పవన్ ఇంటికి హైదరాబాద్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కు రేణు దూరంగానే ఉంటోంది. అలాగే టీవీ షోలు, రవితేజ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. మంచి పాత్రలు ఉంటే సినిమాలు చేస్తోంది.
పవన్ కళ్యాణ్ తో విడిపోయాక ఆయనకు దూరంగానే రేణు ఉంటోంది. తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా ఉండడంతో ఆయన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినకూడదని పూణేలోనే ఉంటోంది. అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ వచ్చి తన పని పూర్తి చేసుకొని వెళ్లిపోతోంది.

అయితే పవన్ ను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని ఎప్పటినుంచో వైసీపీ బ్యాచ్, ఇతర వ్యతిరేక మూకలు కాచుకు కూర్చున్నాయి. అందుకే పవన్ మాజీ భార్య జనసేనలో చేరుతోందంటూ గ్రాఫిక్స్ యాడ్ చేసి.. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి జనసేన కండువా వేసుకొని ఆమె మాట్లాడుతున్న ఫొటోను వైరల్ చేశారు..
అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే తనకు లేదని రేణుదేశాయ్ ఎప్పటి నుంచో చెబుతోంది. అస్సలు సంబంధంలేని ఆ సబ్జెక్ట్ లోకి రానని.. సినిమాలు, సీరియల్స్, టీవీ షోలు మాత్రమే చేస్తానని కుండబద్దలు కొట్టింది. తనను రాజకీయాల్లోకి లాగి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయవద్దని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తోంది. ఇదంతా పవన్ ను దెబ్బతీసే కుట్ర అంటోంది. రేణుదేశాయ్ ఇచ్చిన క్లారిటీతోనైనా ఆమెపై వస్తున్న ఈ రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి..